టాలీవుడ్ నటుడు నాని నటించిన మజ్ను చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన కేరళ కుట్టి అను ఇమ్మానుయేల్ వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. గోపీ చంద్ సరసన నటించిన ఆక్సిజన్ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమైంది. మజ్ను సినిమాలో హోమ్లీగా కనబడిన అను ఇమ్మాన్యువల్ రాజ్ తరుణ్ తో కలిసి నటించిన కిట్టు ఉన్నాడు జాగ్రత్తలో కొద్దిగా గ్లామర్ గా కనబడింది. మరోవైపు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కళ్ళలో ఎలా పడిందో తెలియదు గాని ఏకంగా పవన్ సరసన ఛాన్స్ కొట్టేసి షాకిచ్చింది. ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉండగా… అల్లు అర్జున్ సరసన ‘నా పేరు సూర్య’లో కూడా హీరోయిన్ గా అవకాశం కొట్టేసి ఔరా అనిపించింది.
అయితే అమ్మడు అందాలను సోషల్ మీడియాలో హల్చల్ చేసే ఫోటో షూట్స్ తో చూస్తూనే ఉన్నాం. సారీస్ లో, మినీ స్కర్ట్స్ లో కాస్త గ్లామర్ ఒలకబోస్తున్న ఈ అమ్మడు ఆక్సిజన్ ఆడియో వేడుకలో రెడ్ డ్రెస్సు లో అక్కడున్న ప్రేక్షకుల మతులు పోగోటింది. మరి ఈ అందాలను చూసే త్రివిక్రమ్.. ఎన్టీఆర్ సినిమా ఛాన్స్ ఇవ్వబోతున్నాడా.. ఇప్పటికే త్రివిక్రమ్ మరొకసారి అనుకి ఛాన్స్ ఇస్తున్నాడని.. ఎన్టీఆర్ సరసన తాను తియ్యబోయే సినిమాలో అను ఇమ్మాన్యుయేల్‌కి ఛాన్స్ ఇచ్చాడనే టాక్ ఉంది. అయితే అధికారిక సమాచారం మాత్రం లేదు. మరి ఈ రేంజ్ లో అందాల ఆరోబోస్తుంటే అవకాశాలు వాటంతట అవే తన్నుకొస్తుంటాయి. అందుకే అమ్మడు ఇలా తయారైందంటున్నారు.