టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస హిట్స్‌తో మంచి జోరుమీద ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం జై లవ కుశ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇక మరోవైపు బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా చేసి బుల్లితెర ప్రేక్షకులని కూడా ఆకట్టుకున్నాడు తారక్. అయితే తాజాగా ఎన్టీఆర్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఆ న్యూస్ ఏంటంటే దేశంలోని అత్యంత ధనికుల జాబితాలో ఎన్టీఆర్ కూడా ఉండటం. అప్పుడప్పుడు కొన్ని సర్వేలు అత్యంత ధనికుల జాబితా అంటూ ఒక లిస్ట్‌ని విడుదల చేస్తుంటాయి.
ఇక అందులో ఎప్పుడు చూసిన బాలీవుడ్ కోలీవుడ్ హీరోలే ఉంటారు. అయితే తాజాగా ఈ లిస్ట్ లోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చేరిపోయాడు. ఆ సర్వే ప్రకారం ఎన్టీఆర్ ఆస్తులు మొత్తం 1600 కోట్లు ఉన్నాయని తెలుస్తుంది. వాటిలో 450 కోట్లు తండ్రి వారసత్వంగ వస్తే, 250 కోట్లు అతని మామ స్టూడియో ఎన్ అధినేత నార్నె శ్రీనివాసరావు గారు ఇచ్చినట్లు సమాచారం. అలాగే హైదరాబాద్ లోని కొన్ని ఏరియాల్లో 45 – 75 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయని తెలుస్తుంది. ఇక అతని భార్య లక్ష్మీ ప్రణతి పేరు మీద కూడా భారీగా ఆస్తులున్నాయట. అవన్నీ కలిపితే 1600 కోట్లు ఉంటాయని అంచనా. దీనితో ఎన్టీఆర్ దేశంలోని అత్యంత ధనికుల జాబితాలో 66 వ స్థానం దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.