పవన్ కళ్యాణ్ భక్తుల్లో ఒకడైన హీరో నితిన్ నటించిన లై చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే అందులో నితిన్ సరసన నటించిన.. మేఘా ఆకాష్‌కి మాత్రం నితిన్ మరోసారి అవకాశం ఇచ్చాడు. లై సినిమాలో ఇద్దరి జోడీ బాగుంది కానీ సినిమా బాగోలేకపోవడంతో ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే ఇద్దరి మధ్య మాత్రం మంచి కెమిస్ట్రీ కుదిరింది దాంతో తన తదుపరి సినిమాలో కూడా మేఘా ఆకాష్ నే తీసుకున్నాడు నితిన్ . లై సినిమా కోసం అమెరికాలో ఏకంగా 70 రోజుల పాటు ఉన్నారు దాంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు అప్పట్లోనే పుకార్లు షికారు చేసాయి .
అయితే తాజాగా కృష్ణ చైతన్య సినిమా కోసం మేఘా ఆకాష్‌తో రొమాన్స్ చేస్తున్నాడు నితిన్. దాంతో వారిద్దరు మానసికంగా మరింతగా దగ్గరయ్యారని సమాచారం. అందుకే త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయమని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నితిన్ ని లవ్ చేస్తోంది కాబట్టే హీరో రామ్ సరసన నటించే ఛాన్స్ వస్తే ఆ సినిమాని నిరాకరించింది మేఘా ఆకాష్. ఇక ఈ సినిమా తర్వాత నితిన్ – మేఘా ఆకాష్ పెళ్లి అనే అంటున్నారు. ఇక ఈ రూమర్స్ చాలా రోజుల నుండి స్ప్రెడ్ అవుతున్నా.. నితిన్ కానీ మేఘ కాని ఖండించక పోయే సరికి.. వారిద్దరి మధ్య ఎఫైర్ ఉందని సోషల్ మీడియాలో కూడా చర్చించుకుంటున్నారు.