టాలీవుడ్ నటుడు బిగ్ బాస్ ఫేం శివబాలాజీ భార్య మధుమితన సెల్ ఫోన్‌కు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అసభ్య పదజాలంతో కూడిన మెసేజ్ లను పంపిస్తున్నారని.. సోషల్ మీడియాలో ఉన్న ఓ వీడియో లింక్ పై అభ్యంతరకంగా, ఆశ్లీలతతో నిండిన మెసేజ్ లు కూడా పెడుతున్నారని ఆయన ఫిర్యాదు చేశాడు.
ఇక ఈ ఫిర్యాదులపై మధుమిత స్పందిస్తూ.. ఆకతాయిలు చాలా మంది మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారని, వారికి తాను కూడా టార్గెట్ గా మారానని చెప్పింది. వాళ్ల పైశాచిక ఆనందం కోసం మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారని, వాళ్లకు బుద్ధి చెప్పాలన్న ఆలోచనతోనే, పోలీసులను ఆశ్రయించామని తెలిపింది.
అయితే ఇప్పడు తాజాగా.. పోలీసులు మధుమితను అశ్లీల మెసేజ్ లతో వేధించింది ఎవరో కనిపెట్టేశారని సమాచారం. సోషల్ మీడియా ఖాతాలకు వచ్చిన మెసేజ్ ల ఐపీ అడ్రస్ లను సేకరించిన పోలీసులు, ఓ వ్యక్తిని అనుమానిస్తూ, ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి ఎవరన్న విషయం అధికారికంగా ప్రకటించనప్పటికీ, సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తేనని సమాచారం.
మధుమిత మొబైల్ ఫోన్‌కు సైతం అతను, అతనితో పాటు మరో వ్యక్తి పేరిట రిజిస్టర్ అయిన సెల్ నంబర్ నుంచి కించపరిచేలా మెసేజ్‌లు వచ్చినట్టు గుర్తించిన పోలీసులు, అతను ఎవరన్న విషయమై ఆరా తీస్తున్నారు. త్వరలోనే నిందితుల వివరాలను బయటపెడతామని సైబరాబాద్ పరిధిలోని సైబర్ క్రైమ్ పోలీసు వర్గాలు వెల్లడించాయి.