అప్పట్లో టాలీవుడ్ లో తన అందాలను ఆరబోస్తూ కథానాయికగా నటించి నాటి తరం సినిమా ప్రేక్షకుల్ని అలరించిన సీనియర్ నటి సుమలత.పోయిన ఏడాది మెగా కుటుంబం నుండి వచ్చిన అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రంలో ఒక పాత్రలో ఆమె కనిపించారు.తాజాగా సదరు నటి మంగళవారం తన ఫేస్‌బుక్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు.
తన మోకాలికి తీవ్ర గాయమైనప్పుడు కమల్ తన ఇంటికి వచ్చారని గుర్తు చేసుకున్నారు. తన భర్త అంబరీష్‌తోపాటు కమల్‌తో దిగిన ఫొటోను పంచుకున్నారు.’ఇప్పటికి ఎప్పటికీ నా అభిమాన నటుడు కమల్‌హాసన్.. నాకు బాగా గుర్తుంది.
నాలుగేళ్ల క్రితం నా మోకాలికి బాగా గాయమైంది. అప్పుడు చేతికర్ర సహాయంతో నడుస్తున్నా. కమల్ సర్ మా ఇంటికి భోజనానికి వచ్చారు. కమల్ మాటల మధ్యలో తన శరీరంలోని ప్రతి ఎముక రెండుసార్లు విరిగిందని నాతో చెప్పారు. అప్పటి నుంచి నా శరీరంపై జాలి చూపించడం మానేశా’ అని పోస్ట్ చేశారు.