రామ్ గోపాల్ వర్మ-నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన శివ మూవీ తెలుగు సినీ చరిత్రలో ఇప్పటికీ ఓ సంచలనమే. అయితే మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ కానుంది. ఇటీవల రాజుగారి గది 2 మూవీ ప్రమోషన్స్‌లో త్వరలో ఆర్జీవీతో మూవీ చేస్తున్నట్లు ప్రకటించిన నాగార్జున ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. నవంబర్ 20 నుండి ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు వర్మ ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశాడు
దాదుపు 25ఏళ్ల తర్వాత నాగార్జునతో మళ్లీ సినిమా చేయబోతున్నానని, శివ లానే దీన్ని కూడా సక్సెస్ ఫుల్ చిత్రంగా తెరకెక్కిస్తాననే నమ్మకంతో వున్నానని వర్మ తెలిపారు. దాంతో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ, నాగార్జున కాంబోలో రూపొందబోయే చిత్రం కథ ఎలా ఉండబోతోందనే విషయం అంతటా హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున చేత ఓ పోలీస్ అధికారి క్యారక్టర్ చేయిస్తున్నారట.
దయానాయక్ జీవితంలోని కొన్ని కీలకమైన అంశాలతో ఈ చిత్రం స్క్రిప్టు రెడీ చేసారని తెలుస్తోంది. గతంలోనూ రామ్ గోపాల్ వర్మ .. ముంబయ్ పోలీస్ శాఖలో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఇన్ స్పెక్టర్ దయానాయక్ జీవితంపై అబ్ తక్ చప్పన్ అనే చిత్రం తీసారు . ఇప్పుడు ఆ సినిమాలో కలవని కొన్ని సన్నివేశాలతో నాగ్ తో సినిమా చెయ్యబోతున్నారట. ఈ మేరకు ముంబై లో ఓ పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం.