బాలీవుడ్ వివాదాస్పద క్రిటిక్.. నటుడు.. నిర్మాత కమల్ ఆర్.ఖాన్ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించటం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మద్యకాలంలో అతను చేస్తున్న పనికిరాని ట్వీట్లను భరించలేక అతని ట్విటర్ ఖాతాను సస్పెండ్ చేసిన విషయం విదితమే. ఆ తర్వాత తన ట్విటర్ ఖాతాను సస్పెండ్ చేయించింది బాలీవుడ్ నటుడు ఆమీర్‌ఖానేనని ఆరోపిస్తూ మీడియాలో రచ్చ రచ్చ చేసాడు. అయితే దాని వల్ల ఫలితం కనపడలేదు. ఈ విషయాన్ని హైకోర్టులో తేల్చుకుంటానని హెచ్చరించాడు.
ఫైనల్‌గా ఇప్పుడు తన ట్విట్టర్ ఖాతాను యాక్టివేట్ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ ప్రెస్ రిలీజ్‌ను విడుదల చేశాడు. నా ట్విటర్ ఖాతాను యాక్టివేట్ చేయాల్సిందిగా ట్విటర్ ఇండియాను వేడుకొంటున్నాను. మరో 15 రోజుల్లో నా ఖాతా యాక్టివేట్ చేయకపోతేఆత్మహత్య చేసుకుంటాను. అప్పుడు నా చావుకు కారణమైన ట్విటర్ ఇండియా యానిట్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు అని పేర్కొన్నాడు. కమల్ ట్విటర్ సస్పెండ్ కావడంతో ఎందరో నెటిజన్లు, సెలబ్రిటీలు వూపిరిపీల్చుకున్నారు. తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ బాలీవుడ్, టాలీవుడ్ స్టార్లపై కామెంట్లు పెడుతున్న కమల్‌పై ఇప్పటికే చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.