రెజినా ఒకప్పుడు తన అందాలతో వరస సినిమాల్లో టాలీవుడ్ సినిమా ప్రేక్షకులను ,యువతను ఎంతగానో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ .చూడటానికి బక్కగా ఉన్న కానీ అందాలను ఆరబోయడంలో తనకు సాటి తానే అని నిరూపించుకుంది అమ్మడు .ఆ తర్వాత అవకాశాలు లేకపోయిన కానీ హాట్ హాట్ ఫోటో షూట్లతో వార్తలోకి ఎక్కిన అందాల రాక్షసి తాజాగా యంగ్ హీరో నారా రోహిత్ కథానాయకుడిగా దర్శకుడు పవన్ మల్లెల తెర కెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బాలకృష్ణుడు’ లో అమ్మడు నటిస్తుంది .
ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు. రోహిత్ సరసన కథానాయికగా రెజీనా నటించింది. ఈ సినిమాలో ఆమె గ్లామర్ డోస్ పెంచేసిందనే టాక్ ఇప్పుడు ఫిల్మ్ నగర్లో జోరుగా షికారు చేస్తోంది. కొంతకాలం క్రితం వచ్చిన ‘రారా కృష్ణయ్య’ లోను .. రీసెంట్ గా వచ్చిన ‘నక్షత్రం’ సినిమాలోను రెజీనా అందాలను బాగానే ఆరబోసింది.
తాజాగా అమ్మడు ‘బాలకృష్ణుడు’లో మరింతగా గ్లామర్ డోస్ పెంచిందని చెబుతున్నారు. కొత్తగా వస్తోన్న పోస్టర్లు కూడా అది నిజమేననే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.