భారీ ప్రాజెక్టు బాహుబలి తర్వాత అనుష్క నటిస్తోన్న లేటెస్ట్ మూవీ భాగమతి. ఫిల్ల జమీందార్ ఫేం జి అశోక్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. ఇవాళ స్వీటీ అనుష్క బర్త్ డే సందర్భంగా చిత్రయూనిట్ భాగమతి ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది.
పోస్టర్ ను చూస్తుంటే అనుష్క బాహుబలి సినిమాలో పోషించిన దేవసేన పాత్రను మరిపించేలా ఉన్నట్లుగా అనిపిస్తోంది.అనుష్క లీడ్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో ఆదిపినిశెట్టి, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ భాగమతి చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఎస్ఎస్ థమన్ భాగమతి కి మ్యూజిక్ డైరెక్టర్. ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదలకానుంది. మూడు లాంగ్వేజెస్ ఫస్ట్ లుక్ పోస్టర్లను చిత్రయూనిట్ సోషల్మీడియా ద్వారా షేర్ చేసింది.