తెలుగు చిత్రసీమలోని సీనియర్ కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. గత కొంతకాలంగా వరుస పరాజయాలు ఎదురవ్వడం, రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉండటంతో రాజశేఖర్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారిపోయింది. పూర్వ వైభవం కోసం తపిస్తున్న ఆయన విజయం కోసం చందమామకథలు, గుంటూర్ టాకీస్ చిత్రాలతో ప్రతిభను చాటుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో జోడీకట్టారు.
వీరిద్దరి కలయికలో రూపొందిన చిత్రం గరుడవేగ. ఇక ఈ భారీ బడ్జెట్ చిత్రం కావడంతో.. సినిమా మొదలు పెట్టినప్పుడే రాజశేఖర్‌కి అంత రిస్క్ అవసరమా.. అంటూ కౌంటర్లు వేసిన వారు ఇప్పుడు గరుడ వేగని చూసి మెచ్చుకుంటున్నారు. ఈ చిత్రంతో ఒకవైపు రాజశేఖర్ కమ్ బ్యాక్ అవగా.. ప్రవీణ్ తన సత్తా ఏంటో చూపించారు. ఇక మరోవైపు అయితే ఈ చిత్రంలో నటించిన హీరోయిన్లు పండగ చేసుకుంటున్నారు.
గరుడ వేగలో ఒక హీరోయిన్‌గా నటించిన పూజ కూమార్ తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ. తమిళంలో మాత్రం కమల్‌తో రెండు సినిమాలు చేసేసింది. ఇప్పుడీ చిత్రం మంచి హిట్ అవడంతో తెలుగులోనూ తనకు అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయంటోంది. ఇక మరో భామ శ్రద్ధా దాస్. ఈ ముద్దు గుమ్మ తెలుగు వారికి పరిచయమే కానీ ఇంత వరకు సరైన బ్రేక్ లేదు.. దీంతో గరుడవేగ హిట్ ఈ అందాల భామకి కూడా మంచి బ్రేక్ ఇచ్చిందని దీంతో తెలుగులో తనకి ఆక్సీజన్ దొరికినట్టేనని శ్రద్ధా పండుగ చేసుకుంటోంది.