Home / MOVIES / సాయి ప‌ల్ల‌వి చేసిన ప‌నికి సిగ్గుప‌డిన.. నాని..!

సాయి ప‌ల్ల‌వి చేసిన ప‌నికి సిగ్గుప‌డిన.. నాని..!

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని మ‌రో డిఫ‌రెంట్ ఆండ్ యూత్‌ఫుల్ స్టోరీతో మరోసారి బాక్సాఫీస్‌ను కుమ్మేయ‌డానికి రెడీ అవుతున్నాడు. ఇప్పుటికే ఈ ఏడాదిలో నేనులోక‌ల్, నిన్నుకోరి లాంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌ను త‌న ఖాతాలో వేసుకుని జోరుమీద ఉన్న నాని.. తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసిన సాయిప‌ల్ల‌వితో క‌లిసి చేస్తున్న చిత్రం MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి). డిసెంబర్ లో విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్ర ఫస్ట్ టీజర్‌ని చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఇక ఈ చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్ యూత్‌ని టార్గెట్ చేసాడని టీజ‌ర్ చూస్తే అర్ధ‌మ‌వుతోంది.

ఇక MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి) టీజర్ విష‌యానికి వ‌స్తే.. మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ లైఫ్ స్టైల్‌ని నాని ఎస్టాబ్లిష్ చేసే విధానం చాలా కొత్త‌గా ఉంది. ఇక నాని న‌ట‌న గురించి చెప్పాలంటే.. అదిరిపోయే న్యాచుర‌ల్‌ పెరఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. అయితే ఇక్క‌డ ఒక కొత్త పాయింట్‌ని ద‌ర్శ‌కుడు ట‌చ్ చేసిన‌ట్టు ఉన్నాడు. సాధార‌ణంగా ల‌వ్ మ్యాట‌ర్స్‌లో అన్ని చోట్ల ముందుగా అబ్బాయిలే ప్రేమను అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తుండడం చూస్తుంటాం. అయితే MCA లో మాత్రం నాని కి డైరెక్ట్‌గా సాయి పల్లవి లవ్ ప్రపోజ్ చేస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాని.. పెళ్ళెప్పుడు చేసుకుందాం అని.. గులాబీ ఇచ్చి మరీ అడిగేస్తుంది సాయి పల్లవి. దానికి నాని షాక్ అవుతూ ఒక చేతిలోని ఫోన్ వదిలేస్తూ.. మరో చేతితో ఆ గులాబీని అందుకునే అద్భుత దృశ్యం ఆకట్టుకుంది. అలాగే సాయి పల్లవి హాగ్ చేసుకుందాం రమ్మంటుంటే నాని పడే సిగ్గు.. మాట‌ల‌తో వ‌ర్ణించ‌లేని విధంగా ఉంది. దీంతో MCA ఫ‌స్ట్ టీజ‌ర్ యూత్ భ‌లే ఆక‌ర్షించ‌గా.. నాని ఖాతాలో మ‌రో హిట్ ఖాయ‌మ‌ని అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat