ఏపీ ప్రభుత్వం ఏ ముహుర్తాన నంది అవార్డులను ప్రకటించిందో కానీ సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఇప్పటికే పలువురు తెలుగు సినీ ప్రముఖులు నంది అవార్డు పై బహిరంగంగానే అసంతృప్తిని తెలియ పర్చారు. నంది అవార్డుల ఎంపికలో మొత్తం ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారని.. నంది అవార్డ్స్ కమెటీ పై సినీ వర్గీయులు పెదవి విరుస్తున్నారు. ఇక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా నంది అవార్డ్స్ ఇచ్చిన కమిటీ పై వ్యంగంగా స్పందిచిన విషయం తెలిసిందే.
దీంతో నంది అవార్డ్స్ పై విమర్శించిన వాళ్లను బూతులు తిడుతూ నంది అవార్డుల కమెటీ మెంబర్ దర్శకుడు మద్దినేని రమేష్ తీవ్రమైన బూతు పదజాలంతో స్పందిచారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టులు పెడుతూ.. రామ్‌గోపాల్ వర్మ చేసిన ఆరోపణలను తప్పుపడుతూ.. బండ బూతులు.. అమ్మనా బూతులు.. తిడుతూ స్పందించాడు. అంతే కాకుండా నంది అవార్డులు ప్రకటించి నప్పటి నుండి ఎవరెవరు అయితే అసంతృప్తిని వ్యక్తం చేశారో.. వాళ్ళ పై కూడా ఖబర్ధార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.
బన్నీగాళ్ళకి.. బుజ్జీగాళ్లకి.. బండ్ల గాళ్ళకి.. బక్కగాళ్ళకి.. బలుసుగాళ్ళకి.. బలుపుగాళ్లకి.. బఫూన్‌గాళ్ళకి.. ఇక్కడెవడూ బయపడెవారు లేరు … ఖబడ్దార్ కొడకల్లారా… మీ తోక ఊపుళ్ళు పిల్లల దగ్గర చుపండి పులుల దగ్గర కాదు అంటూ పోస్టు పెట్టరు. అయితే బన్ని గాళ్ళు, బుజ్జి గాళ్ళు, బండ్ల గాళ్ళు అంటూ పోస్ట్ చేసిన మద్దినేని తర్వాత దాన్ని ఎడిట్ చేసారు. అయితే ఆయన ఎడిట్ చేయడానికి ముందే దాన్ని స్క్రీన్ షాట్ తీసిన వర్మ దాన్ని తన వాల్ మీద పోస్ట్ చేసాడు. దీంతో మద్దినేని రమేష్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది. దీంతో రమేష్ చేసిన పోస్ట్‌లో పేర్లు ఉన్నవారు ఎలా రియాక్ట్ అవుతారో అని సినీ వర్గీయులు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.