టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం అజ్ఞాతవాసి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ అజ్ఞాతవాసికి సంబంధించి విడుదల చేసిన ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలిగిన పవన్‌ను హీరోయిన్ కీర్తీసురేష్ బుగ్గగిల్లుతూ సరసమాడుతున్న పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది.
ఇక సెట్లో పవన్, త్రివిక్రమ్, అను ఇమాన్యుయేల్ కలిసి దిగిన ఫొటోలు నెట్టింట్లో ఇప్పకే ఓ ఊపుఊపిన సంగతి తెలిసిందే.రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మూవీ టీమ్ డిఫెరెంట్‌గా సినిమాని ప్రమోట్ చేస్తోంది. ఇక ఇటీవల రిలీజైన బయటికొచ్చి చూస్తే టైమేమో..సాంగ్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్గా నెక్ట్స్ సింగిల్ గాలి వాలుగ.. రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించేసింది. ఈ సాంగ్‌ని డిసెంబర్ 12న విడుదల చేయనున్నారని… ఈ చిత్రాన్ని మాత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.