Home / MOVIES / సినీ న‌టుడు విజయ్ సూసైడ్ కేసులో ప్ర‌ముఖ బిజినెస్‌మెన్..?

సినీ న‌టుడు విజయ్ సూసైడ్ కేసులో ప్ర‌ముఖ బిజినెస్‌మెన్..?

ప్రముఖ తెలుగు సినీ హాస్యనటుడు విజయ్‌ ఆత్మహత్యకు పాల్పడిన విష‌యం తెలిసిందే. అయితే విజయ్ ఆత్మహత్య వ్యవహారంలో మాత్రం అనేక మ‌లుపులు తిరుగుతున్నాయి. త‌న చావుకు ముందు తీసుకున్న ఫోన్ వీడియో పోలీసుల చేతికి చిక్క‌డంతో విజ‌య్ సూసైడ్ ర‌క‌ర‌కాల ట్విస్ట్‌లు ఇస్తోంది. ఆ వీడియోలో తన ఆత్మహత్యకు కారణం తన భార్య వనితతో పాటు, ప్రముఖ పారిశ్రామిక సంస్థ నవయుగ ఇన్ ప్రా డైరెక్టర్ శశిధర్ కారణమని విజయ్ పేర్కొన్నాడని మీడియాలో కూడా వార్త‌లు వ‌స్తున్నాయి.

అంతే కాకుండా తన వ్యాపార అవసరాల కోసం వనితను వాడుకున్నారని అతను ఆరోపించాడు. మరో న్యాయవాది శ్రీనివాస్ పేరు కూడా విజయ్ పేర్కొన్నాడని చెబుతున్నారు. భార్య వేదింపులు తట్టుకోలేకపోయానని అతను తెలిపాడు. కాగా విజయ్ భార్య వనిత మాత్రం శశిధర్ ఎవరో తనకు తెలియదని అంటోంది. తనను విజయ్ వేధించేవాడని, వేరే అమ్మాయితో వివాహేతర సంబందం ఉందని , దాంతో తాను వేరుగా ఉంటున్నానని ఆమె అంటోంది. చనిపోవడానికి ముందు విజయ్ ఒక వీడియో తీసుకున్నాడని..,అందులో ఈ విషయాలు ఉన్నాయని అంటున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat