టాలీవుడ్‌లో ఒక దశాబ్దం నుండి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ హవానే నడిచింది. ఇతను చిన్న హీరోల దగ్గర నుండి పెద్ద పెద్ద హీరోలకి తన మ్యూజిక్ అందించి అందరినీ తన వైపు తిప్పుకున్నాడు. తన మ్యూజిక్‌తో మేజిక్ చేసిన దేవి.. కమర్షియల్‌గా కూడా సక్సెస్ అందుకున్నాడు. ఇతనికి ఇప్పటికి ఫాన్స్ ఉన్నారు. కమర్షియల్ సినిమాలకు డిఫరెంట్ మ్యూజిక్ అందించగల సత్తా వున్న మ్యూజిక్ డైరెక్టర్. అయితే ఈ మధ్య మాత్రం దేవిశ్రీ మ్యూజిక్ కొంచెం రొటీన్ అయిపోతోందని.. అతను ఒక ఫార్మాట్లో సాగిపోతున్నాడని విమర్శలు వస్తున్నాయి.
దేవి శ్రీ నుండి తాజాగా వచ్చిన కొత్త ఆల్బం నాని నంటించిన ఎంసీఏ చిత్రం. అయితే ఆ చిత్రంలోని పాటలు ఏమాత్రం కొత్తదనం లేకుండా తయారయ్యాయని.. ఆల్బం మొత్తం రొటీన్ గానే ఉందని చెబుతున్నారు. ఈ ఆల్బం తో పాటు అనూప్ స్వరాలు అందించిన హలో సినిమా సాంగ్స్ ఆల్బంకు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇక తమిళ్ రాక్ స్టార్ అనిరుద్ తొలి సారి తెలుగు లో మ్యూజిక్ చేసిన అజ్ఞాతవాసి సాంగ్స్ కూడా అదిరిపోయాయి అంటున్నారు. ఈ సినిమా నుండి రెండు సాంగ్స్ బయటికి వచ్చినప్పటికి ట్రెండ్ ను క్రియెట్ చేసాయి. మొత్తానికి దేవి వీక్ ఆడియో ఇచ్చిన సమయంలోనే ఇటు అనూప్.. అటు అనిరుధ్ అదిరిపోయే పాటలతో అతడిని ఇరుకున పెట్టారు. ఇక రంగస్థలం..భరత్ అను నేను ఆడియోలతో దేవి మళ్లీ తన ముద్ర చూపించకుంటే.. అతడికి మున్ముందు కష్టమే అవుతోందని టాలీవుడ్ సర్కిల్లో చర్చలు మొదలయ్యాయి.