గత కొంతకాలంగా టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ విషయంలో మౌనంగా ఉన్న ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీ క్రిటిక్ కత్తి మహేష్ తాజాగా మరో సంచలనాత్మక ట్వీట్ చేశాడు. దాదాపు నాలుగు నెలలుగా పవన్ ఫ్యాన్స్‌తో ఇటు సోషల్ మీడియా,అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వేదికగా యుద్ధం చేస్తున్నడు కత్తి మహేష్..
అయితే జనవరి 15 వరకు సైలెంట్‌గా ఉండాలన్న ప్రముఖ రచయిత దర్శకుడు కోన వెంకట్ సలహాను పాటిస్తున్న విషయం మనకు తెలిసిందే.అయితే పవన్ అభిమానుల నుంచి మాత్రం విమర్శలు ఆగుతున్నట్టుగా లేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ట్విటర్ ద్వారా కత్తి మహేష్ పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ `ఖాళీ పాత్రలే ఎక్కువ శబ్దం చేస్తాయి. నిజాల కోసం జనవరి 16 వరకు ఆగండి` అని ట్వీట్ చేశాడు.