రోజులన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎదుటి వారు విమర్శలు ఎదుర్కొనేటప్పుడు.. మనం కూడా నలుగురితో కలిసి వారి పై ఓ రాయి విసిరామనుకోండి… తీరా మనకు ఏదో ఒకరోజు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వారు మాత్రం ఎందుకు ఊరుకుంటారా చెప్పండి. ఇదిగో సరిగ్గా జబర్దస్త్ యాంకర్ అనసూయ విషయంలో అలాంటిదే జరిగింది. ఓ పిల్లాడు ముచ్చటపడి ఓ ఫొటో కోసం ప్రయత్నించాడు. దానికే అంతలా రెచ్చిపోయిన అనసూయ గోల గోల చేసింది. పాపం స్కూల్ పిల్లాడు పోనీలే అని కూడా అనుకోలేదు. నన్నే నా పర్మిషన్ లేకుండా ఫొటో
తీస్తావా.. అంటూ ఊగిపోతూ చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాగి మరీ పగలగొట్టింది.
see also :టీడీపీ కంచుకోటలో.. జగన్ దూకుడు.. వైసీపీ ఎంపీ ఖరారు..?
అభిమానులన్న తర్వాత సెలబ్రిటీతో సెల్ఫీ కోసం రావడం అనేది చాలా కామన్. తమ అభిమాన సెలబ్రిటీతో ఓ సెల్ఫీ అనేది తమ తీపి జ్ఞాపకంగా వారి దగ్గర ఉండాలని కోరుకుంటారు.అయితే తాజాగా జబర్దస్త్ యాంకర్ అనసూయను మాత్రం ఆ పిల్లాడి ముచ్చటను కాదనడమే కాకుండా సెల్ ఫోన్ పగలగొట్టి వివాదాస్పదమైంది. ఎంతో బాధ పడిన ఆ పిల్లాడి తల్లి గీత హైదరాబాద్ తార్నాక వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఉస్మానియా విశ్వవిద్యాలయ పోలీసు స్టేషన్ లో కంప్లయింట్ చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ అందాల యాంకర్ అర్జున్ రెడ్డి మూవీ విడుదల సమయంలో విజయ్ దేవరకొండను విమర్శించిన సంగతి అందరికి తెలిసిందే.
see also : రాజకీయాలను షేక్ చేస్తున్న జగన్ తాజా ట్వీట్…
సినిమా కుటుంబ సమేతంగా చూసేలా లేదంటూ కామెంట్లు చేసింది. అయితే వెంటనే రివర్స్ కామెంట్లు అప్పుడే పడ్డాయనుకోండి. నువ్వు చేస్తున్న జబర్దస్త్ ఏమీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాదులే తల్లీ… అంటూ స్పందించారు నెటిజన్లు. అయితే ఇప్పుడు అనసూయ వంతు వచ్చేసరికి విజయ్ దేవరకొండ తన ప్రతాపం చూపించాడు. ఫ్యాన్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఫొటో దిగాలే తప్పా.. ఫోన్‌ను విసిరేయకూడదంటూ విజయ్ దేవరకొండ సెటైర్ వేశాడని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త. మరి దీనిపై అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. ఇప్పటికే సోషల్ మీడియాలో జరుగుతున్న దాడిని తట్టుకోలేక ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్లన్నీడిలీట్ చేసి కూర్చున్న ఈ అమ్మడు ఇక విజయ్ దేవరకొండకు ఎలా సమాధానం చెబుతుందో
చూడాలి.