కెరీర్ మొదట్లోనే వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసింది అను ఇమ్మాన్యుయేల్. నాని, పవన్ కళ్యాన్, అల్లు అర్జున్, ఇలా వెంట వెంటనే భారీ స్టార్ కాస్టింగ్ ఉన్న చిత్రాలతోపాటు.. భారీ బడ్జెట్ చిత్రాల్లోనూ నటించింది ఈ భామ. ఆఫర్లు వచ్చినప్పటికీ.. కెరీర్‌కు మాత్రం కోరుకున్న బ్రేకులు ఇవ్వలేకపోయారు.
మజ్ను యావరేజ్‌గా ఆడింది. అజ్ఞాతవాసి, ఆక్సీజన్, నా పేరు సూర్య చిత్రాలు డిజాస్టర్‌గా నిలిచిపోయాయి. దాంతో అను ఇమ్మాన్యుయేల్‌పై ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. నా పేరు సూర్యతో జాతకం మారుతుందని చాలానే ఊహించుకుంది అను. కానీ, బన్నీ కూడా షాక్ ఇవ్వడంత అనుకు షాక్ మామూలుగా తగల్లేదు. ఇక రవితేజ అమర్ అక్బర్ ఆంటోని చిత్రం కూడా అను నుంచి చేజారిపోయింది. దీంతో అను ఇమ్మాన్యుయేల్‌కు ఉన్న ఏకైక ఆప్షన్ శైలజారెడ్డి అల్లుడు, ప్రముఖ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్యతో రొమాన్స్ చేస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 31న విడుదల కానుంది.