ఇటీవల బాలీవుడ్ స్టార్ రణ్వీర్ న్యూడ్‌గా తీసిన ఫొటో షూట్ ఎంత రచ్చ అయింది ప్రత్యేకంగా చెప్పలేదు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. అదే సమయంలో కొంతమంది రణ్‌వీర్‌కు మద్దతు తెలిపారు కూడా. తాజాగా ఆయన బాటలో ఓ నటి కూడా చేరింది.
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్‌శెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘ఖత్రోన్ కె ఖిలాడీ 12’ ఫేమ్, టీవీ ఆర్టిస్ట్ ఎరికా ప్యాకర్డ్ తాజా సంచలనానికి తెరలేపారు. తన టాప్‌లెస్ ఫొటోను ఇన్‌స్టాలో ఆమె పోస్ట్ చేశారు. ‘రణ్‌వీర్‌కు కంపెనీ ఇస్తున్నా.. కానీ మీరు నా బమ్స్ మాత్రం చూడలేరు’ అంటూ ఎరికా అక్కడ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చేసిందండోయ్. ఎరికా చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు.