అందాలతార త్రిషకు పర్సనల్ లైఫ్‌లో మళ్లీ ఏదైనా ఇబ్బంది ఎదురైందా అని ఆమె అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే తాజాగా త్రిష సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ దీనికి కారణం. ఎమోషనల్‌గా ఉన్న ఆ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ త్రిష ఏం పోస్ట్ పెట్టిందో తెలుసా..
”విషపూరితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు వాళ్లంతట వారే మాట్లాడటం మానేయడం చాలా సంతోషంగా ఉంది. దీన్ని చూస్తుంటే చెత్త దానంతటదే తొలిగినట్లుంది”. అని త్రిష తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు చాలా డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్ట్ ఆమె ఎవర్ని ఉద్దేశించి పెట్టారు. మళ్లీ ఏమైనా ప్రేమలో ఫెయిల్ అయ్యారా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. గతంలో త్రిషకు కోలీవుడ్ నిర్మాత వరుణ్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగింది. కానీ ఆ తర్వాత పెళ్లి పీటలు ఎక్కకుండానే విడిపోయారు.