Home / MOVIES / బాలయ్య కామెడీకి పడిపడి నవ్విన ఫ్యామిలీ..

బాలయ్య కామెడీకి పడిపడి నవ్విన ఫ్యామిలీ..

అగ్ర హీరో బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో భాగంగా టర్కీ వెళ్లారు. ఈ క్రమంలో టర్కీలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన బాలయ్య అక్కడ ఓ ఫ్యామిలీతో సరదాగా మాట్లాడారు.

హే భాయ్.. టిఫిన్ చేసేశా.. ఇక మందులు వేసుకోవాలి.. ఓవైపు హిందూపురం ఎమ్మెల్యేగా, మరోవైపు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. ఇలా ఇన్ని పనులు చేయడం వల్ల ఆనందంగా ఉంది. ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చునేవాళ్లకి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తాయి. అని చెప్పారు. తర్వాత అక్కడే ఉన్న మహిళను చూపిస్తూ.. వీళ్లు ఇంట్లో కూర్చొని సీరియళ్లు చూస్తుంటారు. మైండ్ పాడుచేసుకుంటారు. నా ఉద్దేశం ప్రకారం టీవీ తక్కువ చూస్తే కళ్లకు మంచిది. అసలు చూడకపోతే ఇంకా మంచిది. అంటూ ఫన్నీగా చెప్పారు. దీంతో ఆ ఫ్యామిలీ నవ్వుకుంది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బాలయ్య చేసిన కామెడీకి ఓ వైపు నవ్వుకుంటూనే మరోవైపు అంతటి అగ్ర హీరో అయినప్పటికీ ఎలాంటి గర్వం లేకుండా సామాన్యులతో ఆయన ప్రవర్తించిన తీరుకు అందరూ బాలయ్యను మెచ్చుకుంటున్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat