Home / MOVIES / పూరీ జగన్నాథ్‌పై వినాయక్‌ సంచలన వ్యాఖ్యలు

పూరీ జగన్నాథ్‌పై వినాయక్‌ సంచలన వ్యాఖ్యలు

‘లైగర్‌’ ఫ్లాప్‌తో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఊహించని ఈ ఫ్లాప్‌తో ఆస్తులమ్మి మరీ అప్పులు తీర్చాడని ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పూరీ స్నేహితుడు, ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌ స్పందించారు. గతంలోనూ పూరీ జగన్నాథ్‌ ఎన్నో ఆటుపోట్ల ఎదుర్కొన్నాడని.. అన్నింటినీ ఆయన అధిగమిస్తాడని చెప్పారు. అతడి కెపాసిటీ ఏంటో తమకు తెలుసని చెప్పాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వినాయక్‌ మాట్లాడారు.

‘లైగర్‌’ ఫ్లాప్‌తో పూరీ జగన్నాథ్‌ జీవితం ఏమీ మారదని.. గతంలో ఎన్నో ఫ్లాప్స్‌, హిట్స్‌, సూపర్‌హిట్స్‌ ఆయన అందుకున్నారని వినాయక్‌ గుర్తు చేశారు. ‘‘కొంతమంది ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారు. పోయిన దాన్ని పూరీ తిరిగి పొందలేనంత అసమర్థుడేమీ కాదు. ఫ్లాప్స్‌ వచ్చినపుడు ఆయన పని అయిపోయిందని కొంతమంది అనుకున్నారు. కానీ ‘పోకిరి’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చాడు.

సినిమా అన్నాక ఆర్థికంగా ఉండే ఇబ్బందులు సహజం. ‘లైగర్‌’ వల్ల ఎంత పోయింది? ఎంత వచ్చింది?అనేది అతడికే తెలుసు. ఆయన తెరకెక్కించిన సినిమా ఏదైనా ఫ్లాప్‌ అయితే బయటవాళ్లందరూ ఏవేవో అనేసుకుంటారు. కానీ అతడు అలా కాదు. ఫ్లాప్‌ వస్తే దాని గురించి ఎక్కువగా ఆలోచించడు’’ అని వీవీ వినాయక్‌ చెప్పారు.

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar