Home / MOVIES / డార్లింగ్స్ గెట్ రెడీ.. త్వరలో ‘ఆది పురుష్’ టీజర్!

డార్లింగ్స్ గెట్ రెడీ.. త్వరలో ‘ఆది పురుష్’ టీజర్!

ఎట్టకేలకు ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ అందించింది ఆది పురుష్ టీమ్. డార్లింగ్ అభిమానులతో పాటు సినీప్రియులు సైతం ఎంతగానో ఎదురుచూస్తోన్న క్రేజీ మూవీ ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న మూవీ కావడంతో సర్వత్రా ఆది పురుష్‌పై ఓ రేంజ్‌లో అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్‌ను పంచుకోలేదు చిత్రబృందం. దీంతో అభిమానులు యూనిట్‌పై సోషల్ మీడియా ద్వారా మూవీ టీజర్, ట్రైలర్‌ల కోసం ఒత్తిడి తీసుకొచ్చారు.

తాజాగా ఆది పురుష్ మూవీ అప్డేట్‌ను అధికారికంగా ప్రకటించారు డైరెక్టర్ ఓం రౌత్. దసరా కానుకగా అక్టోబరు 2న అయోధ్యలోని సరయు నది ఒడ్డున ఆది పురుష్ టీజర్, ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ మూవీలో ప్రభాస్ రాఘవగా, బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ లంకేశ్‌గా, కృతి సనన్ జానకిగా, సన్నీ సింగ్ లక్షణుడిగా సందడి చేయనున్నారు. వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12న ఆది పురుష్ రిలీజ్ అవుతుంది.

Image

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar