Home / MOVIES / అదరగొట్టిన ‘ఆదిపురుష్’ టీజర్.. నీళ్లలో ప్రభాస్ తపస్సు!

అదరగొట్టిన ‘ఆదిపురుష్’ టీజర్.. నీళ్లలో ప్రభాస్ తపస్సు!

 ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్. రామాయణం ఇతివృత్తంగా రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. దీంతో మూవీపై భారీ అంచనాలు పెంచుకున్న సినీప్రియులు, అభిమానులు టీజర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఆదివారం సాయంత్రం అయోధ్యలో టీజర్ రిలీజ్ చేసింది చిత్రబృందం.

టీజర్ ప్రారంభంలో ప్రభాస్ నీళ్లలో తపస్సు చేస్తూ కనిపిస్తారు. రాముడి గెటప్‌లో ప్రభాస్‌ను చూస్తే అచ్చు శ్రీరాముడిలానే అనిపించకుమానదు. మూవీలో గ్రాఫిక్స్ ఓ రేంజ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక లంకేశ్‌గా సైఫ్ అలీఖాన్, సీతమ్మగా కృతి సనన్, ఆంజనేయుడిగా దేవదత్త నాగే, లక్ష్మణుడిగా సన్నీసింగ్ తమ పాత్రలతో చూపరులను కట్టిపడేశారు. మొత్తానికి టీజర్ భారీ అంచనాలను పెంచుతోంది. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Image

Image

 

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar