Home / MOVIES / అందుకే గాడ్‌ఫాదర్‌ కోసం సల్మాన్ రెమ్మునరేషన్ తీసుకోలేదట..!

అందుకే గాడ్‌ఫాదర్‌ కోసం సల్మాన్ రెమ్మునరేషన్ తీసుకోలేదట..!

మోహన్‌రాజ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మూవీ గాడ్‌ఫాదర్. రీసెంట్‌గా రిలీజైన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఓ యూట్యూబర్‌గా కీలక పాత్రలో నటించారు. ఇక పూరీ మెగాస్టార్‌తో ఇన్‌స్టా వేదికగా కాసేపు చిట్ చాట్ నిర్వహించారు. ఇందులో మూవీకి సంబంధించి పలు ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు చిరు. గాడ్ ఫాదర్ కోసం సల్మాన్ ఖాన్ రెమ్మునరేషన్ తీసుకోలేదని చెప్పారు మెగాస్టార్. అందుకు కారణం ఏంటంటే..

గాడ్‌ఫాదర్‌లో మసూద్ భాయ్ అనే ఓ లీడింగ్ పాత్రలో సల్మాన్‌ ఖాన్ కనిపించారు. అయితే ఈ మూవీలో నటించినందుకు సల్మాన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. సల్మాన్‌కు రామ్‌చరణ్ అంటే చాలా ఇష్టమట. ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన చరణ్‌ను కలిసే వెళ్తారు. చెర్రీ కూడా సల్మాన్‌ను అంతే ఇష్టపడతాడు. సల్మాన్ ఇచ్చిన ఓ జాకెట్‌ను చరణ్ ఇప్పటికీ భద్రంగా దాచుకున్నాడని చిరంజీవి తెలిపారు. సల్మాన్ పుట్టినరోజున చరణ్ ఓ సర్‌ఫ్రైజ్ ప్లాన్ చేశాడట. ఇక బ్యాంకాక్‌లో ఓ యాడ్ షూటింగ్‌లో మొదటి సారి చిరు, సల్మాన్ కలుసుకున్నారట. చిరు తెలుగులో చేస్తే, హిందీ వెర్షన్‌లో సల్మాన్‌ నటించారు. అప్పటి నుంచి చిరు, సల్మాన్ మధ్య అనుబంధం కుదిరింది. చరణ్, చిరు ఇద్దరూ సల్మాన్‌కు బాగా నచ్చిన వ్యక్తులు కావడం వల్ల వారి సినిమా కోసం రెమ్మునరేషన్ తీసుకోకుండా సల్మాన్ నటించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat