ప్రస్తుతం సరోగసి హట్ టాపిక్‌గా మారింది. ఇటీవల నయనతార దంపతులు పెళ్లయిన నాలుగు నెలలకే మగ కవలలకు తల్లిదండ్రులయ్యారు. దీంతో వారు సరోగసి పద్ధతిలోనే పిల్లల్ని కన్నారని అందరూ అన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం సింగర్ చిన్మయి శ్రీపాద కూడా ఈ సరోగసి పద్ధతిలోనే కవల పిల్లలకు తల్లయిందని హల్ చల్ చేశారు. తాజాగా చిన్మయి ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను పంచుకొని, ఆ ఫేక్ స్టేట్‌మెంట్స్‌కు స్ట్రాంగ్‌గా చెక్‌పెట్టింది.
నెట్టింట ఎంతో యాక్టివ్‌గా ఉండే చిన్మయి తాజాగా సరోగసి విషయంపై స్పందించింది. ఇటీవల చిన్మయి శ్రీపాద, రాహుల్ రవీంద్రన్ దంపతులకు కవలలు జన్మించారు. ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో చెప్పలేదు. ఒక్క ఫోటో కూడా లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడింది. సడెన్‌గా కవలలు పుట్టారని చెప్పడంతో చిన్మయికి కూడా సరోగసి ద్వారా పిల్లలు పుట్టారని అనుకున్నారు.
తాజాగా చిన్మయి వీడియోను పంచుకుంది. 32 వారాల తర్వాత నా ఫోటోను మీతో పంచుకుంటున్నా అని చిన్మయి తెలిపింది. వీలైనన్ని ఎక్కవ ఫోటోలు తీసుకోలేదని, అందుకు బాధగా ఉందని చెప్పింది. అయితే మొదటి సారి చిన్మయి ప్రెగ్నెంట్ అయినప్పుడు కొన్ని నెలలకే క్యాన్సిల్ అయిదంట. అందుకే రెండో సారి ప్రెగ్నెంట్ అయినప్పుడు సీక్రెట్ చేశామని చెప్పింది చిన్మయి. కడుపుతో ఉన్నప్పుడు కూడా చిన్మయి వృత్తి జీవితాన్ని కొనసాగించింది. అక్కడ ఎవరూ ఫోటోలు తీయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది. సరోగసి, ఐవీఎఫ్ లేదా నార్మల్ డెలివరీ ఏదైనా సరే అమ్మ అమ్మే అని.. నాకు సరోగసి ద్వారా పిల్లలు పుట్టారని ఎవరైనా అనుకుంటే నేనేమీ లెక్కచేయనని తెగేసి చెప్పేసింది. ఈ సందర్భంగా తన పిల్లలకు పాలు ఇస్తున్న ఫోటోను షేర్ చేసుకుంది.