మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ తన భార్య, సీరియల్ నటి చారు ఆసోపాను తీవ్రంగా వేధిస్తున్నాడట. ఈవిషయాన్ని చెప్తూ కన్నీటి పర్యంతమయ్యింది చారు ఆసోపా. ఆమెపై కోపం వచ్చిన ప్రతీసారి తన భర్త ఆమెను వదిలివెళ్లిపోయేవాడని తెలిపింది. ఆయన వల్ల తన కెరీర్ నాశనం అయ్యిందని చెప్తోంది.
పెళ్లి జరిగినప్పటి నుంచి రాజీవ్ సేన్ తనని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడని తెలిపింది నటి చారు ఆసోపా. కరోనా టైంలోనూ ఆమెను ఒంటరిగా వదిలేసి మూడు నెలల పాటు ఎక్కడికో వెళ్లిపోయాడట. ఫోన్ చేస్తే నెంబర్లు అన్నీ బ్లాక్ చేశాడని తెలిపింది ఆసోపా. దీంతో భర్త ఏమయ్యాడోనని డిప్రెషన్‌లోకి వెళ్లిపోయినట్లు తెలిపింది నటి. ఆ బాధ నుంచి బయటపడేందుకు వర్క్ లైఫ్‌ను ఫోకస్ చేసింది నటి.
ఇక అక్బర్ కా బల్ బీర్బల్‌తో రీ ఎంట్రీ ఇచ్చింది. తాను మళ్లీ వర్క్ ప్రారంభించిందని తెలియడంతో భర్త తిరిగి తన వద్దకు వచ్చాడు. అంతే కాకుండా ఆమెతో పాటు పనిచేసే నటులందరికీ ఆమెతో దూరంగా ఉండాలని మెసేజ్‌లు పెట్టేవాడు. అతడి చేష్టలకు విసిగిపోయిన నిర్మాతలు షో నుంచి ఆమెను తొలగించేశారు. దీంతో ఆమె విడాకులకు అప్లయ్ చేసింది. దీంతో రాజీవ్ సేన్ క్షమాపణ చెప్పి ఇకపై నిన్ను బాగా చూసుకుంటా అని చెప్పడంతో ఆమె నమ్మి మళ్లీ ఆయనతో కలిసి ఉంది. మళ్లీ కొన్ని రోజులకే రాజీవ్ సేన్ ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టడంతో ఇక శాశ్వతంగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు నటి తెలపింది.