Home / MOVIES / వెంటిలేటర్‌పై సూపర్‌స్టార్ కృష్ణ.. సీరియస్‌ అంటున్న వైద్యులు!

వెంటిలేటర్‌పై సూపర్‌స్టార్ కృష్ణ.. సీరియస్‌ అంటున్న వైద్యులు!

సూపర్‌స్టార్ కృష్ణ ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో మహేశ్‌బాబు, నమత్ర, కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చేర్చారు. ప్రస్తుతం కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు.

రాత్రి దాదాపు 2 గంటల సమయంలో సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణను హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అప్పటికి కృష్ణ పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఎమర్జెన్సీకి తరలించి సీపీఆర్ చేశారు వైద్యులు. 20 నిమిషాలు సీపీఆర్ చేసిన తర్వాత ఆయన కార్డియాక్ అరెస్టు నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థతి సీరియస్‌గా ఉందని.. మెరుగైన వైద్యం అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ మేరకు హెల్త్ బులిటిన్‌ను విడుదల చేశారు. మరో 48 గంటల వరకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat