Home / MOVIES / Neethone Nenu Movie Review : సినిమా బండి ఫేమ్ వశిష్ట “నీతోనే నేను” మూవీ రివ్యూ!
vasishta-and-kushitha-moksha-starring-neethone-nenu-movie-review-and-rating
vasishta-and-kushitha-moksha-starring-neethone-nenu-movie-review-and-rating

Neethone Nenu Movie Review : సినిమా బండి ఫేమ్ వశిష్ట “నీతోనే నేను” మూవీ రివ్యూ!

Neethone Nenu Movie Review : విద్య నేర్పే గురువు దేవుడితో స‌మానం.. అందుక‌నే గురుదేవో మ‌హేశ్వ‌ర అని అన్నారు. త‌న‌కు ఎన్ని స‌మ‌స్య‌లు ఉన్నా ఓ మంచి గురువు త‌న శిష్యుల ఉన్న‌తికి ఎంతో క‌ష్ట‌ప‌డుతుంటాడు. అలాంటి గురువుకి సంబంధించిన క‌థే ‘నీతోనే నేను’. టీచ‌ర్‌గా ప‌ని చేసి ఇప్పుడు మంచి స్టేజ్‌కు చేరుకున్న నిర్మాత ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి త‌ను నిజ జీవితంలో చూసిన కొన్ని ఘ‌ట‌న‌ల‌ను బేస్ చేసుకుని ఈ మూవీ క‌థ‌ను త‌యారు చేశారు. త‌నే శ్రీమామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత‌గా మారి అంజి రామ్ ద‌ర్శ‌క‌త్వంలో ‘నీతోనే నేను’ సినిమాను రూపొందించారు. సినిమా బండి సినిమాతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన వికాష్ వ‌శిష్ట క‌థానాయ‌కుడిగా న‌టించారు. కుషిత క‌ళ్ల‌పు, మోక్ష క‌థానాయ‌కులుగా అల‌రించారు. అక్టోబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమాతో మేక‌ర్స్ ఏం చెప్పాల‌నుకున్నారు?. ‘నీతోనే నేను’ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీనా, ల‌వ్ స్టోరీనా? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే ముందు క‌థంటే చూద్దాం….

కథ‌:

రామ్ (వికాస్ వ‌శిష్ట‌) ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఉపాధ్యాయుడిగా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తుంటాడు. స్కూల్‌కి వ‌చ్చామా? మ‌న ప‌ని మ‌నం చూసుకున్నామా? వెళ్లామా? అనే ఆలోచ‌న‌తో కాకుండా తన స్కూల్‌లో పిల్ల‌లు చ‌క్క‌గా చదువుకుని అభివృద్ధిలోకి రావాల‌ని బ‌లంగా కోరుకుంటాడు. మంచి చేయాల‌ని తాప‌త్ర‌య‌ప‌డే త‌న‌ను చూసి కొంద‌రు ఉపాధ్యాయులు ఈర్ష్య ప‌డుతుంటారు. కొంద‌రు ఇష్ట‌ప‌డుతుంటారు. అలా రామ్‌ను ఇష్ట‌ప‌డుతుంది ఆయేషా (కుషిత క‌ళ్ల‌పు). ఆమె అదే స్కూల్‌లో పీటీ టీచ‌ర్‌గా ప‌ని చేస్తుంటుంది. క్ర‌మంగా ఆయేషాకు రామ్‌పై ఏర్ప‌డ్డ ఇష్టం ప్రేమ‌గా మారుతుంది. ఓ రోజు ఆయేషా త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను రామ్‌కు చెబుతుంది. అయితే త‌న‌కు పెళ్లైంద‌ని, చిన్న‌నాటి స్నేహితురాలే సీత (మోక్ష‌)ని పెళ్లి చేసుకున్న‌ట్లు రామ్ చెబుతాడు. ఓ రోజు రామ్‌, సీత‌ల‌ను ప‌ల‌క‌రిద్దామ‌ని వారింటికి వెళుతుంది ఆయేషా. అయితే ఆమెకు షాకింగ్ విష‌యాలు తెలుస్తాయి. ఇంత‌కు రామ్ గురించి ఆయేషాకు తెలిసే నిజం ఏంటి? రామ్ జీవితంలో ఉన్న స‌మ‌స్య ఏంటి? సీత‌కు ఆయేషాకు ఉన్న సంబంధం ఏంటి? త‌న స్కూల్‌లోని పిల్ల‌ల కోసం రామ్ చేసే ప‌నేంటి? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

Neethone Nenu | Telugu Movie | nowrunning

విశ్లేష‌ణ‌:

చాలా చోట్ల గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్స్‌లో చ‌దివే పిల్ల‌ల‌కు చాలా స‌రైన వ‌స‌తులు ఉండ‌వు. కానీ వాళ్లకి మంచి స‌దుపాయాల‌ను ఏర్పాటు చేస్తే వాళ్లు కార్పొరేట్ స్కూల్స్‌లోని పిల్ల‌ల‌కు ధీటుగా మంచి ర్యాంకులు సంపాదిస్తారు. అనే విష‌యాన్ని ద‌ర్శ‌కుడు అంజిరామ్ తెర‌కెక్కించిన తీరు బావుంది. ఓ వైపు మెసేజ్‌తో పాటు మంచి ల‌వ్ స్టోరీని మిక్స్ చేసి తెర‌కెక్కించారు. క‌థ‌ను స్కూల్ బ్యాక్ డ్రాప్‌లో తీసుకెళుతూ ఇంట‌ర్వెల్ ముందు హీరో, హీరోయిన్ మ‌ధ్య ఇచ్చే ట్విస్ట్ బావుంది. అయితే ఫ‌స్టాఫ్‌ను కాస్త సాగ‌దీత‌గా చేసిన‌ట్లు ప్రేక్ష‌కులకు అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ విష‌యానికి వ‌స్తే ఈ ట్విస్టుల‌ను మ‌రింత ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించారు. కాక‌పోతే క‌థ మ‌ధ్య‌లో క‌మ‌ర్షియ‌ల్ సాంగ్ పెట్టటం కాస్త ప‌క్క‌కెళ్లారేమో అనిపిస్తుంది. సినిమాటోగ్రాఫ‌ర్ ముర‌ళీ మోహ‌న్ విజువ‌ల్స్ బావున్నాయి. మ్యూజిక్ డైరెక్ట‌ర్ కార్తీక్ అందించిన పాట‌లు బావున్నాయి. నిర్మాత సుధాక‌ర్ రెడ్డి త‌న ప‌రిధి మేర‌కు మంచి క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో సినిమాను రూపొందించారు.

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే సినిమా బండితో మెప్పించిన వికాస్ వ‌శిష్ట ఓ వైపు గ‌వ‌ర్న‌మెంట్ టీచ‌ర్‌గా, మ‌రో వైపు భార్య కోసం ప‌రిత‌పించే పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించారు. కుషిత క‌ళ్ల‌పు లుక్ ప‌రంగా చ‌క్క‌గా ఉంది. ఎమోష‌న‌ల్ పాత్ర‌లో మోక్ష మెప్పించింది. క‌న్నింగ్ టీచ‌ర్ పాత్ర‌లో ఆకెళ్ల న‌ట‌న ఆక‌ట్టుకుంది. మొత్తంగా ఒక గవర్నమెంట్ టీచర్, త‌న‌కు వ్య‌క్తిగ‌త జీవితంలో ఎన్ని బాధలు ఉన్నా స్టూడెంట్స్ కోసం ఎంతలా తాపత్రయపడతారు అనే అంశాన్ని కమర్షియల్ కోణంలో చూపించింది నీతోనే నేను.

రేటింగ్: 2.75/5

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat