Home / MOVIES / విడుదలకు ముందే “రాజా ది గ్రేట్ “రికార్డు ..

విడుదలకు ముందే “రాజా ది గ్రేట్ “రికార్డు ..

టాలీవుడ్ మాస్ మహారాజు ,స్టార్ హీరో రవితేజ హీరోగా ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తోండగా వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రాజా ది గ్రేట్‌’.క్యాప్సన్ వెల్కమ్ టూ మై వరల్డ్ . ఈ మూవీ లో రవితేజ బ్లైండ్ పాత్రలో నటిస్తున్నారు .అయితే ఈ మూవీ కి సంబంధించి తాజాగా విడుదల చేసిన టీజర్‌కు టాలీవుడ్ సినిమా ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది.

ఈ క్రమంలో ఈ సినిమాకు చెందిన రీమేక్‌ హక్కులకు భారీ డిమాండ్‌ ఉన్నట్లు ఫిల్మ్ వర్గాల్లో గుసగుసలు . హిందీ రీమేక్‌ హక్కులు రూ. 18 కోట్లకు ఈ చిత్రం అమ్ముడుపోయినట్లు బాలీవుడ్‌ వర్గాలు తెలిపాయి.

మెహరీన్‌ రవి పక్కన హీరోయిన్ గా నటిస్తున్నారు. శిరీష్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సాయికార్తీక్‌ సంగీత దర్శకుడు . ప్రస్తుతం కేరళలో హీరో హీరోయిన్‌లపై ఒక పాటని చిత్రీకరిస్తున్నారు. రానున్న దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat