విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ మాజీ మేనేజర్ సిమోన్ షెఫీల్డ్ ఓ సంచలన విషయం వెల్లడించింది. హాలీవుడ్ నిర్మాత హార్వే వైన్స్టైన్.. ఐశ్వర్య రాయ్ ని లొంగదీసుకోవడానికి ప్రయత్నించడానికి, ఆమెతో పడక సుఖం కోసం నన్ను బెదిరించాడానికి ఓ సంచలన ప్రకటన చేసింది. ఐశ్వర్య రాయ్ వృత్తికి సంబంధించిన విషయాలన్నీ నేనే చూసుకునేదాన్ని. హార్వే ఐశ్వర్యతో డేటింగ్ ఏర్పాటు చేయమని నన్ను వేడుకొన్నాడు. అతను ఓ పశువులా ప్రవర్తించేవాడు.
ఇక ఓసారి నేను, ఐష్ అతని ఆఫీస్ నుంచి బయటికి వస్తుంటే నన్ను పక్కకి తీసుకెళ్లి బెదిరించాడు. కానీ నేను భయపడలేదు. అతన్ని ఐష్ ఛాయలకు కూడా రానివ్వలేదు అనిచెప్పుకొచ్చింది సిమోన్ షెఫీల్డ్. ఇప్పటికే పలువురు హాలీవుడ్ నటీమణులు హార్వే తమపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు.అతను చాలా మంది ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడని ఆరోపిస్తున్నారు. ఇతడి క్యారెక్టర్ గురించి తెలుసుకొని భార్య కూడా విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది.