ప్రముఖ దక్షిణాది హీరోయిన్, కొంతకాలం క్రితం లైంగిక వేధింపులకు గురైన భావన, తన వివాహాన్ని వాయిదా వేసుకుంది. ప్రియుడు నవీన్ తో పెళ్లికి సిద్ధమై, నిశ్చితార్థం కూడా పూర్తి చేసుకుని, 26వ తేదీన పెళ్లి చేసుకోనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారం ఒకటవ్వాలని నిర్ణయించుకున్న ఈ జంట అనూహ్యంగా ఇప్పుడు పెళ్లిని వాయిదా వేసుకుంది. ఈ విషయాన్ని భావనే స్వయంగా వెల్లడించింది. అయితే ఇందుకు గల కారణాలను మాత్రం ప్రస్తావించలేదు.
ఇక తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయడానికే వాయిదా వేసుకుందా.. లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో గానీ, మాలీవుడ్ వర్గాల్లో దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా లైంగిక వేధింపుల కేసు దీనికి ఓ ప్రధాన కారణంగా ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హీరో దిలీప్ ఇటీవల బెయిల్ పై విడుదల కాగా, నిర్మాత నవీన్ ద్వారా ఈ కేసు నుండి భావనను ఉపసంహరించుకోవాల్సిందిగా ఒత్తిడి తీసుకువచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కారణం వలనే వాయిదా పడినట్లుగా ప్రచారం జరుగుతున్నా.., ఇందులో నిజానిజాలు ఎంత ఉన్నాయో గానీ, భావన పెళ్లి వాయిదా పడిందన్నది మాత్రం వాస్తవం.