టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున నటుడు కంటే ముందు వ్యాపారవేత్త. ఆయన ఏం చేసిన అందులో బిజినెస్ యాంగిల్ ఉటుంది. చాల కమర్షియల్‌గా ఆలోచిస్తారు. చిత్రాల నిర్మాణంలోనూ ఆయన అదే పంధాని కొనసాగిస్తున్నారు. దాదాపుగా ఆయన నష్టపోయిన సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి.
మరోసారి సేఫ్ గేమ్ ఆడుతున్నారు నాగార్జున. శివ వచ్చిన 28ఏళ్ల తర్వాత వర్మ- నాగార్జున కాంబినేషన్ లో ఓ సినిమా రానుంది. ఈ సినిమాను నాగార్జున నిర్మించడం లేదు. రెమ్యూనరేషన్ తీసుకొని జస్ట్ నటిస్తాడంతే. ఇంకా చెప్పాలంటే నాగ్ పై ఎలాంటి ఒత్తిడి లేదు. వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా సినిమా అనగానే అది అన్నపూర్ణ స్టూడియో ప్రొడక్ట్’ అని అంతా ఫిక్సయిపోయారు.
అయితే ఇప్పుడు అది వర్మ కంపెనీలో తెరకెక్కుతోంది. నాగ్‌కి కథ చెప్పి ఒప్పిస్తే – నిర్మాతని చూసుకోవాల్సిన అవసరం ఉండదని వర్మ భావించాడు. ఐతే నాగార్జున తెలివి ప్రదర్శించారు. నాకు పారితోషికం చాలు.. ఓ నిర్మాతనీ చూసుకో అని చెప్పేశారట. దీంతో స్వయంగా వర్మ నిర్మించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వర్మ ప్రెజెంట్ ఫామ్‌ను దృష్టిలో ఉంచుకొని నాగ్ తెలివిగా ఈ నిర్ణయం తీసుకున్నాడని సినీ సర్కిల్లో చర్చించుకుంటున్నారు.