తెలుగు బుల్లితెర పై అనూహ్యంగా దూసుకొచ్చిన బిగ్ బాస్ షోతో రాత్రికి రాత్రే చాలా మంది సెలబ్రటీలు అయిపోయారు. ఆ షోలో పార్టీశీపేట్ చేసినవాళ్ళందరూ ఇప్పుడు బిగ్ బాస్ షోకి వెళ్లడానికి ముందు, వెళ్ళిన తర్వాత అని తమ కెరీర్ లను బేరీజు వేసుకొంటున్నారు. అందుకు కారణం వారి కెరీర్ గ్రాఫ్, పాపులారిటీలో విపరీతమైన మార్పులు చోటు చేసుకోవడమే. అందుకు తాజా ఉదాహరణ శివబాలాజీ.. కొన్నాళ్ళ ముందు క్యారెక్టర్ రోల్స్ కూడా లేక ఇబ్బందిపడిన శివబాలాజీ ఆఫీస్ ముందు ఇప్పుడు నిర్మాతలు హీరోగా సినిమా తీస్తామంటూ క్యూ కడుతున్నారు.
ఇక తాజాగా ఓ పేరున్న సంస్థ శివబాలాజీ – నవదీప్ లు హీరోగా ఓ మల్టీస్టారర్ ను ప్లాన్ చేసింది. మీడియం బడ్జెట్ లో కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఓ యువకుడు దర్శకుడిగా పరిచయమవ్వనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ కు వెళ్లనుంది. ఇదే తరహాలో శివబాలాజీకి గనుక ఇంకో రెండుమూడు ఆఫర్లు వచ్చాయంటే మాత్రం బిగ్ బాస్ షో లోగోకి ఫ్రేమ్ కట్టించి వాళ్ళింట్లో పూజ గదిలో పెట్టుకోవాల్సిందే. చూద్దాం బిగ్ బాస్‌తో వచ్చిన ఫేం మనోడికి ఇంకెన్ని ఆఫర్లు తెచ్చి పెడుతుందో చూడాలని సర్వత్రా చర్చించుకుంటున్నారు.