గరుడవేగ చిత్రం బంపర్ హిట్ అవడంతతో హ్యాపీగా ఉన్న రాజశేఖర్ కుటుంబానికి మరో షాక్ తగిలింది. రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని డ్రైవింగ్ చేస్తూ జూబ్లీహిల్స్ వద్ద అదుపు తప్పి ఆగి ఉన్న కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 30 లక్షల రూపాయలతో తాము రెండు వారాల క్రితమే కొన్న కొత్త కారును రాజశేఖర్ కుమార్తె యాక్సిడెంట్ చేశారని బాధితులు అంటున్నారు. యాక్సిడెంట్ అయిన కారుకు సంబంధించి మొత్తం 30 లక్షల రూపాయలు చెల్లించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. యాక్సిడెంట్‌కు సంబంధించి కేసు నమోదు కాలేదు.
ఇటీవల హీరో రాజశేఖర్ ఔట్ రింగ్ రోడ్డుపై వాహనం నడుపుతూ ఆగి ఉన్న కారును ఢీకొట్టిన విషయం తెలిసిందే. అయితే తల్లి మరణంతో తీవ్ర వేదనకు ఆయన నిద్రమాత్రలు మింగడంతోనే అలా జరిగిందంటూ ఆయన కుటుంబ సభ్యులు తెలపడంతో ఈ విషయం కాస్తా సద్దుమణిగింది.తల్లి మరణం, కారు ప్రమాదం, జీవిత సోదరుడు హఠాన్మరణం లాంటి ఘటనలు రాజశేఖర్ కుటుంబంలో వరుసగా చోటుచేసుకున్నాయి. అలాగే ఆయన గుండెపోటుకు గురికావడంతో స్టెంట్ కూడా వేయించుకున్నారు. పదేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తోన్న రాజశేఖర్‌కు ఆయన తాజా చిత్రం పీఎస్వీ గరుడవేగ స్వాంతన కలిగించింది.