వైఎస్ఆర్ కడప జిల్లాలో టీడీపీ నేతలకు మరో పరాభవం ఎదురైంది. కాగా, ఈ రోజు కడప 26వ వార్డులో టీడీపీ ఇంటింటికి కార్యక్రమం జరుగింది. కార్యక్రమం ప్రారంభంలోనే టీడీపీ నేతలను ఆ పార్టీ కార్యకర్తలే వార్డులోకి అడుగు పెట్టకుండా అడ్డుకున్నారు. ఎన్నికల సమయంలోనే మీకు కార్యకర్తలు గుర్తుకొస్తారా..? మిగిలిన సమయాల్లో కార్యకర్తలు గుర్తుకు రారా? అంటూ టీడీపీ నేతలపై ఆ పార్టీ కార్యకర్తలే ప్రశ్నల వర్షం కురిపించారు. కార్యకర్తలను పట్టించుకోకుండా …
Read More »నీ జర్నీ ‘బంగారం గానూ..!’
బంగారం స్మగ్లర్లు బరి తెగిస్తున్నారు. కిలోల కొద్దీ బంగారాన్ని అక్రమంగా దుబాయ్ నుంచి భారత్‌కు తరలిస్తున్నారు. కొందరు బ్యాగుల్లోనూ, చెప్పుల్లోనూ, షూస్‌లోనూ బంగారం దాచి స్మగ్లింగ్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఏకంగా బంగారాన్ని మింగేసి దుబాయ్ నుంచి భారత్‌కు స్మగ్లింగ్ చేస్తున్నారు. కాగా, ఇటువంటి సంఘటనే శంషాబాద్ విమానాశ్రయంలో ఈ రోజు జరిగింది. శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల చేసిన తనిఖీల్లో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి రూ.10 …
Read More »మంత్రి నారాయణపై క్రిమినల్ కేసులు పెడతాం – మంత్రి గంటా
మంత్రి గంటా శ్రీనివాస్ వియ్యంకుడు మంత్రి నారాయణ స్థాపించిన నారాయణ విద్యా సంస్థలతోపాటు చైతన్య కళాశాలలపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ అన్నారు. విద్యార్థులకంటే తమకు ఏదీ ముఖ్యం కాదని, అవసరమైతే కాలేజీ యాజమాన్యాలపై కేసులు పెట్టేందుకు వెనుకాడబోమని మంత్రి గంటా శ్రీనివాస్ స్పష్టం చేశారు. కాగా, ఈ రోజు మంత్రి గంటా శ్రీనివాస్ విశాఖ పరిధిలోగల నారాయణ, చైతన్య హాస్టల్స్‌ను తనిఖీ చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో …
Read More »అవి ఆత్మహత్యలు కావు.. చంద్రబాబు హత్యలు :సీపీఐ నారాయణ
రాష్ట్రంలో ఇప్పటికే 38 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారని, అవి ఆత్మహత్యలు కావు.. ముఖ్యమంత్రి చంద్రబాబు పరోక్షంగా చేసిన హత్యలేనంటూ సీపీఐ నేత నారాయణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాగా, ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 158 అనుమతులు లేని కాలేజీ హాస్టల్స్ ఉన్నా.. వాటిపై చంద్రబాబు సర్కార్ చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. కళాశాల యాజమాన్య వ్యక్తులే కేబినెట్‌లో ఉన్నారని విమర్శించారు. ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థల ఉచ్చులో …
Read More »నేను చెప్పిందే రాసుకోండి – అధికారులతో చంద్రబాబు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విజయవాడలో తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో భాగంగా విజయవాడ పరిధిలో గల బీఆర్టీసీ మధురానగర్ వంతనపై గుంతలు చూసిన సీఎం చంద్రబాబు అధికారులను మందలించారు. 24 గంటల్లోగా గుంతలు పూడ్చాలని సూచించారు. అంతేగాక తాను చెప్పిందే రాసుకోవాలంటూ అదికారులపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. చెత్తను కాల్వలోకి వేయకుండా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.
Read More »చంద్రబాబును ఆపిన చెత్త!
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు చెత్త కోసం ఆగడమేంటని అనుకుంటున్నారా..?. మీ ప్రశ్న అదే అయితే.. ఈ సమాధానం మీ కోసమే. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి అనుసంధానంగా సీఎం చంద్రబాబు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం చేపట్టిన విషయం విధితమే. ఈ క్రమంలో నేడు విజయవాడ నుంచి ప్రసాదంపాడు మీదుగా వెళ్తూ రైవస్ కాల్వ వద్ద చంద్రబాబు ఆగారు. కాల్వ గట్టు వెంబడి చెత్త, …
Read More »చంద్రబాబు ఇంటి ముందు..తప్పిన పెను ప్రమాదం!
ఉండవల్లి కరకట్ట వద్దగల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి ఎదుట ఓ పోలీసు హల్ చల్ చేశాడు. పోలీస్ వ్యాన్‌ను ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఎదురుగా వస్తున్న వాహనాలపైకి దూసుకు పోయాడు. దీంతో అదుపు తప్పిన ఓ బైక్ కింద పడిపోయింది. ఈ ఘటనలో వెంకటపాలెంకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురు ప్రాణాపాయంనుంచి బయటపడ్డారు. అయితే, వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని …
Read More »భారీ వర్షం.. బెంగళూరునూ ముంచుతోంది!
గత రెండు వారాల నుంచి హైదరాబాద్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. బెంగళూరునూ ముంచెత్తుతున్నాయి. కర్నాటక రాజధాని బెంగళూరును శనివారం ఉదయం భారీ వర్షాలు ముంచెత్తాయి. బెంగళూరు నగర వీధులన్నీ భారీ వర్షానికి జలమయమయ్యాయి. ఉత్తరహళ్లి బస్‌స్టేషన్ సమీపంలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. జేపీ నగర్, డాల్లర్స్ కాలనీ, కోరమంగళ తదితర ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లలోకి వరద నీరు చేరాయి. భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు రావడంతో రోడ్లపై భారీ చెట్లు …
Read More »భారత్ ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం!
భారత్ ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఇగ్రవాదులు హతమయ్యారు. కాగా, ఈ రోజు జమ్మూకశ్మీర్ సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం మరో సారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా లిట్టర్ ప్రాంతంలో పాక్ సైన్యం ఈ రోజు ఉదయం కాల్పులకు తెగబడింది. దీంతో రంగంలోకి దిగిన భారత్ బలగాలు పాక్ సైన్యం కాల్పలులను ప్రతిఘటిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఎల్‌ఈటీ ఉగ్రవాదులు హతమయ్యారు. …
Read More »కోదండరామ్ హౌస్ అరెస్ట్.. కారణం అదే!
తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్‌తో సహా పలువురిని పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. కాగా, ఇవాళ జనగామలో ఆరో విడత అమరవీరుల స్ఫూర్తి యాత్రను చేపట్టేందుకు టీజేఏసీ నిర్ణయించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో అల్లర్లు చెలరేగుతాయన్న నేపథ్యంలో ఈ రోజు(శనివారం) ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు వారిని హౌస్ అరెస్టు చేశారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమర వీరుల గొప్పతనాన్ని …
Read More »