Home / NATIONAL

NATIONAL

బీజేపీ కి గుడ్ బై చెప్పేసిన మాజీ సీఎం

గోవాలో బీజేపీకి మ‌రో ఎదురు దెబ్బ త‌గిలింది. నిన్న‌టికి నిన్నే ఉత్ప‌ల్ ప‌ర్రీక‌ర్ రాజీనామా చేసిన సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. మాజీ సీఎం, సీనియ‌ర్ నేత ల‌క్ష్మికాంత్ ప‌ర్సేక‌ర్ బీజేపీకి రాజీనామా చేశారు. ఇక‌పై పార్టీలో కొన‌సాగాల‌ని అనుకోవ‌డం లేద‌ని, రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని ప్ర‌క‌టించారు. రాజీనామా త‌ద‌నంత‌రం ఏమిట‌న్న‌ది త‌ర్వాత ఆలోచించుకుంటాన‌ని ప‌ర్సేక‌ర్ పేర్కొన్నారు.బీజేపీ ప్ర‌క‌టించిన జాబితాలో ల‌క్ష్మికాంత్ ప‌ర్సేక‌ర్ పేరు లేదు. దీనిపై ఆయ‌న తీవ్ర …

Read More »

దేశంలో కొత్తగా 3.33లక్షల కరోనా కేసులు

దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3.33లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే (3,37లక్షలు) స్వల్పంగా తగ్గాయి. రోజువారి కోవిడ్ పాజిటివిటీ రేటు 17.78శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 21,87,205 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More »

ఢిల్లీలో కరోనా విజృంభణ

దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న కేసుల్లో తాజాగా పెరుగుదల కనిపించింది. కాగా.. ఒక్కరోజే 45 మంది కరోనా వల్ల మరణించారు. థర్డ్ వేవ్ ఇవే అత్యధికం. ఇదిలా ఉండగా.. 24గంటల వ్యవధిలో 70,226 టెస్టులు చేయగా.. 11,486 మందికి పాజిటివ్ గా తేలింది.

Read More »

సీఎం అరవింద్ కేజీవాల్ పై పరువు నష్టం దావా

ఢిల్లీ ముఖ్యమంత్రి,ఆప్ అధినేత  అరవింద్ కేజీవాల్ పై పరువు నష్టం దావా వేస్తానని పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీ తెలిపారు. ఇటీవల చరణ్ సన్నిహితుల ఇంట్లో ఈడీ దాడులు జరగ్గా.. ‘నిజాయితీ లేని వ్యక్తి’ అని కేజీవాల్ విమర్శించారు. దీంతో తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా కేజీవాల్ వ్యాఖ్యానించారని.. ఆయనపై దావా వేస్తానని చరణ్ జిత్ చెప్పారు. గతంలోనూ తప్పుడు ఆరోపణలు చేసి.. కేజీవాల్ క్షమాపణలు …

Read More »

తొలిసారి అసెంబ్లీ నుండి బరిలోకి అఖిలేష్ యాదవ్

ఉత్తరప్రదేశ్ లో అధికారంలోకి రావాలని కలలు కంటున్నసమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు,మాజీ సీఎం  అఖిలేష్ యాదవ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన మైన్ పురి జిల్లాలోని కర్హాల్ స్థానం నుంచి పోటీ చేయనున్నారని ఆ పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ ప్రకటించారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న అఖిలేష్ ఇప్పటివరకు ఎమ్మెల్యేగా బరిలో నిలవలేదు. 2012లో ఎమ్మెల్సీ హోదాలోనే ముఖ్యమంత్రిగా పనిచేశారు. అటు సీఎం యోగి గోరఖ్ పూర్ నుంచి …

Read More »

యూపీ సీఎం అభ్యర్థిపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు

యూపీ సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పదవికి తాను కాకుండా ఇంకెవరైనా కనిపిస్తున్నారా అని మీడియాతో అన్నారు. అయితే ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కాగా త్వరలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ స్థానాలు గెలుచుకుని అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. అభ్యర్థుల ఎంపికపై జాగ్రత్త వహిస్తోంది.

Read More »

మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మాకు కరోనా

మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మాకు కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కోవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారంతా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.

Read More »

గోవా బీజేపీకి షాక్

గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ బీజేపీని వీడారు. తాను ఆశించిన నియోజకవర్గం టికెట్ కేటాయించకపోవడంతో అలకబూనారు. పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబడనున్నట్లు వెల్లడించారు. తన తండ్రి పోటీ చేసిన పనాజీ నియోజకవర్గాన్ని సెంటిమెంట్గా భావించి.. అక్కడ నుంచే పోటీ చేస్తున్నట్లు ఉత్పల్ పారికర్ తెలిపారు.

Read More »

భారత దేశ ప్రతిష్టను చెడగొట్టే ప్రయత్నం జరుగుతోంది-ప్రధాని మోదీ

అంతర్జాతీయంగా భారత దేశానికిగల కీర్తి, ప్రతిష్ఠలను సర్వ నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.’స్వాతంత్ర్య అమృత మహోత్సవాల నుంచి సువర్ణ భారత్ దిశగా’ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో గురువారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా బ్రహ్మ కుమారీస్ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మన …

Read More »

వాహనదారులపై మళ్లీ పెట్రో పిడుగు

వాహనదారులపై మళ్లీ పెట్రో పిడుగు పడనుంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 4 వారాల్లో ఏకంగా 25 శాతం పెరిగి ఏడేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ చుక్కలనంటే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. గతేడాది దేశంలో పెట్రోల్ లీటర్ రూ.110 దాటడంతో వాహనదారులు బెంబేలెత్తారు. తర్వాత కాస్త తగ్గడంతో ఉపశమనం లభించినా.. ఇప్పుడు మళ్లీ రేట్లు పెరిగితే సామాన్యులపై భారం తప్పదు.

Read More »