ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ అనే కార్యక్రమంతో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది రష్మీ. అయితే ఇటీవల ఈ ముద్దుగుమ్మ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజమండ్రి వెళ్లారు . ఈ హట్ యాంకర్ వస్తుందన్న విషయం తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. అయితే కరోనా కారణంగా పోలీసులు వారందరిని వెనక్కి పంపారు. అయితే తనని చూడటానికి వచ్చి నిరాశతో తిరిగి వెళ్లిన ఫ్యాన్స్‌కి క్షమాపణలు తెలిపింది రష్మి.
Read More »సింగరేణి కార్మికుడు హౌజ్ క్వారంటైన్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు అధికారులు నడుంబిగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుల్లో 14 చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. మరో నాలుగుచోట్ల తాత్కాలిక చెక్ పాయింట్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ప్రతి చెక్‌పోస్టు దగ్గర రవాణాశాఖ నుంచి ఇన్‌స్పెక్టర్‌స్థాయి అధికారిని నియమించారు. రెవెన్యూ, పోలీసు, వైద్యారోగ్యశాఖ సిబ్బంది అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తున్న వాహనాలను చెక్‌పోస్టుల్లో తనిఖీ చేస్తున్నారు. …
Read More »కేంద్ర పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీకి ఎంపికైన ఎంపీ జోగినపల్లి సంతోష్
ప్రభుత్వ రంగ సంస్థల నివేదికలు, ఖాతాలను మదింపు చేసి, పనితీరుపై కేంద్రానికి నివేదికలు ఇచ్చే పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీకి రాజ్యసభ సభ్యులు ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ఎంపిక అయ్యారు. జాతీయ స్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును మెరుగుపరిచేందుకు మార్గదర్శకంగా నిలిచే ఈ కమిటీ 1964 సంవత్సరం నుంచి పనిచేస్తోంది. లోక్ సభ నుంచి 15 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి ఏడుగురు సభ్యులు మొత్తం …
Read More »ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శక సూత్రాలు – జాగ్రత్తలు
కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందే వైరస్. సరైన జాగ్రత్తలు తీసుకున్నంత కాలం ఆందోళన పడనవసరం లేదు. తీసుకోకపోతే మాత్రం ప్రమాదకరం. ప్రాణాంతకం కూడా. ప్రపంచ ఆరోగ్య సంస్థ(W.H.O) సూచించిన గైడ్ లైన్స్ పాటిస్తే కరోనా బారిన పడకుండా మనల్ని, మన చుట్టూ ఉన్నవారిని కాపాడుకోవచ్చు. కరోనా వైరస్ గాలిలో ప్రయాణించలేదు.* COVID-19 వ్యాధిగ్రస్తులు తుమ్మినా, దగ్గినా వచ్చే తుంపర ద్వారా బయటకు వెదజల్లబడుతుంది. ఆ తుంపర గాలిలో …
Read More »వధూవరులకు వీడియో కాలింగ్ లో ఎంపీ సంతోష్ ఆశీర్వాదం
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఆదేశాల మేరకు కరోన వైరస్ ప్రభావం వల్ల ఎవరు కూడా బయటకు వెళ్ళవద్దని వివాహాలకు శుభకార్యాలకు ఎక్కువమంది హాజరు కావద్దన్న ఆదేశాల మేరకు గత ఆరు సంవత్సరాలుగా తన వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తు తనను కంటికి రెప్పలా కాపాడుకోంటు వస్తూన్న నరేందర్ గౌడ్ ;ఉమారాణిల వివాహం ఈ రోజు భువనగిరి పట్టణం నందు వైఎస్ఆర్ గార్డెన్ లో జరిగినది. ఈ వివాహానికి రాజ్యసభ …
Read More »దేశంలో కరోనా 214 కేసులు
కరోనా ప్రపంచాన్ని వణికిస్తోన్న సంగతి విదితమే.ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుంది. ఈ వైరస్ ప్రభావాన్ని అడ్డుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. అయితే దేశంలో ఈ ఒక్కరోజే పదహారుకు పెరిగాయి. దీంతో ఇప్పటి వరకు ఉన్న మొత్తం కేసుల సంఖ్య 214కి చేరుకుంది అని కేంద్ర్త ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో 188కి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించింది. మరో పంతొమ్మిది మందికి …
Read More »తెలంగాణలో మరో 2 పాజిటీవ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పకడ్భందీ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా టెస్టింగ్ ల్యాబ్ లను ఏర్పాటు చేయడమే కాకుండా విదేశాల నుండి వచ్చేవాళ్లను పలు పరీక్షలు చేస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు మరో రెండు కొత్తగా కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. విదేశాల నుండి వచ్చిన వారిలోనే …
Read More »రేపు కరీంనగర్ కు సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు కరీంనగర్ వెళ్లనున్నారు. కరోనా నివారణ చర్యలను స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షించనున్నారు. అంతేకాకుండా కరోనా వైరస్ పై నగర ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలపై అధికారులతో చర్చించనున్నారు. మరోవైపు ఇండోనేషియా నుండి వచ్చిన కొందరు కరోనా బాధితులు కరీంనగర్ లో పర్యటించిన నేపథ్యంలో నగరంలోని ప్రజలందరికీ ప్రస్తుతం కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Read More »అంగన్ వాడీలలో కరోనా వైరస్ నివారణ చర్యలు
పిల్లలు, బాలింతలు, గర్భిణీలుండే అంగన్ వాడీ కేంద్రాలలో, మినీ అంగన్ వాడీలలో కరోనా వైరస్ నివారణ చర్యలు పటిష్టంగా నిర్వహించాలని, ఎలాంటి నిర్లక్యానికి తావివ్వకూడదని రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. అంగన్ వాడీ కేంద్రాలలో ఆరోగ్య లక్ష్మీ పథకం కింద అందించే భోజనాన్ని ఉదయం 9 గంటల నుంచి 11 గంటలలోపు వండి, వేడి, వేడిగా తల్లులకు, …
Read More »కరోనా నివారణకు తెలంగాణ చర్యలు భేష్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభలకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పకడ్భందీ చర్యలు తీసుకుంటుంది.కరోనా కట్టడి చర్యల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిచెందిన దేశాలకంటే ముందంజలో ఉన్నదని కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ ప్రశంసించింది. ఢిల్లీ, బెంగళూరు, ముంబై కంటే హైదరాబాద్‌లోనే వ్యాధి నివారణ చర్యలు భేషుగ్గా ఉన్నాయని ఆయుష్ ఇన్‌చార్జి డైరెక్టర్ డాక్టర్ పీవీవీ ప్రసాద్, రిసెర్చ్ అధికారి డాక్టర్ సాకేత్‌రాం తిగుళ్ల కొనియాడారు. ‘అభివృద్ధి చెందిన దేశాల్లో …
Read More »