Home / rameshbabu (page 316)

rameshbabu

ఆగస్టు 1 నుండి ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం..

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల ఆగస్టు ఒకటో తారీఖు నుండి ఓటరు కార్డుకు ఆధారం అనుసంధానం చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్ తెలిపారు. నిన్న మంగళవారం హైదరాబాద్ మహానగరంలోని సీఈఓ కార్యాలయం నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వికాస్ రాజ్ మాట్లాడుతూ ఓటరు గుర్తింపు కార్డులతో ఆధార్ అనుసంధానం తప్పనిసరి .. జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా …

Read More »

నిమిషానికి మోదీ చేస్తున్న అప్పు ఎంతో తెలుసా..?

 ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ   2014ఎన్నికల్లో గెలుపొంది ఇప్పటికి రెండు సార్లు అధికార పగ్గాలను దక్కించుకుని ఎనిమిదేండ్లుగా దేశాన్ని  పాలిస్తున్న సంగతి విదితమే. అయితే గత ఎనిమిదేండ్లలో బీజేపీ ప్రభుత్వం చేసిన అప్పు ఇప్పటివరకు ఏ కేంద్ర ప్రభుత్వం చేయలేదని విమర్శలు విన్పిస్తున్నాయి. రోజుకి ఇరవై నాలుగంటలుంటే.. గంటకు అరవై నిమిషాలుంటే నిమిషానికి మోదీ సర్కారు రెండు కోట్ల రూపాయల అప్పును చేస్తుంది. మనం సహజంగా కన్నుమూసి …

Read More »

మాజీ కేంద్రమంత్రి యశ్వంత్‌ సిన్హా సంచలన వ్యాఖ్యలు

ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన మాజీ కేంద్రమంత్రి యశ్వంత్‌ సిన్హా ఈ రోజు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోను.. తాను ఎప్పటికి స్వతంత్రంగా ఉంటానన్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు ముందు ఆయన తృణమూల్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయనను ప్రతిపక్షాలు తమ రాష్ట్ర అభ్యర్థిగా బరిలో …

Read More »

ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధినేత్రి సోనియా గాంధీ ఈ రోజు మంగళవారం ఢిల్లీలో  ఈడీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. దేశం లోనే సంచలనం సృష్టించిన ప్రముఖ పత్రిక కేసు అయిన నేష‌న‌ల్ హెరాల్డ్ మ‌నీల్యాండ‌రింగ్ కేసులో రెండో సారి సోనియా గాంధీ ఈరోజు కూడా విచార‌ణ ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలోని తన ఇంటి నుంచి సోనియా బ‌య‌లుదేరిన స‌మ‌యంలో ఆమె వెంట రాహుల్‌, ప్రియాంకా గాంధీలు ఉన్నారు. జూలై 21వ తేదీన తొలిసారి …

Read More »

నాగార్జున సాగర్‌ జలాశయానికి వరద ప్రవాహం

నాగార్జున సాగర్‌ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 57,669గా ఉన్నది. విద్యుత్‌ ఉత్పత్తికి 5,378 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 544.50 అడుగుల నీరుండగా.. పూర్తిస్థాయినీటిమట్టం 590 అడుగులు. సాగర్‌ డ్యామ్‌ గరిష్ఠస్థాయి 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 201.13 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

Read More »

ఎంఎస్ ధోనీకి సుప్రీం కోర్టు నోటీసులు

టీమిండియా మాజీ కెప్టెన్ ..లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీకి దేశ అత్యున్నత న్యాయ స్థానం నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా ధోనీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన ఆమ్రపాలి గ్రూప్ కేసులో  సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు సూచించిన మధ్య వర్తిత్వాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. గతంలో ఆమ్రపాలి కన్స్ట్రక్షన్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ధోని.. తనకు రావాల్సిన రూ.40కోట్ల పారితోషికాన్ని కంపెనీ …

Read More »

దేశంలో తగ్గిన కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా గడిచిన గత 24 గంటల్లో   కొత్తగా 14,830 కరోనా పాజిటీవ్ కేసులు వెలుగుచూశాయి. మరో 36 మంది కరోనా భారీన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 18,159 మంది కరోనా పాజిటీవ్  వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,47,512 కరోనా పాజిటీవ్  యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 202.50 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.

Read More »

ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్‌కు క‌రోనా

బీహార్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్‌కు క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది. ఆయ‌న గ‌త నాలుగు రోజుల నుంచి జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నారు. గ‌త కొన్ని రోజుల నుంచి ఆయ‌న అధికార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంలేదు. మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవిండ్ వీడ్కోలు, రాష్ట్ర‌ప‌తిగా ముర్ము ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మాల‌కు కూడా ముఖ్యమంత్రి నితీశ్ హాజ‌రుకాలేక‌పోయారు.

Read More »

ప్రభాస్ పై దిశా పటానీ సంచలన వ్యాఖ్యలు

సినిమా ఇండస్ట్రీలో  తాను ఇప్పటివరకు పనిచేసిన మంచినటుల్లో ప్రభాస్ ఒకరని బాలీవుడ్ హీరోయిన్ దిశాపటానీ చెప్పింది.ఇటీవల ప్రాజెక్ట్ చిత్రం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. ‘ప్రభాస్ గ్రేట్ పర్సన్. నిరాడంబరంగా ఉంటారు. ఆయనతో నా మొదటి రోజు షూటింగ్ ఇంకా గుర్తుంది. తన ఇంట్లో తయారుచేసిన ఫుడ్ను టీమ్ మొత్తానికి అందించారు’ అని తెలిపింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో భారీ బడ్జెట్తో ఈ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.

Read More »

మహేష్ అభిమానులకు శుభవార్త

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మాటల మాంత్రికుడు.. విజయాలకు కేరాఫ్ అడ్రస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ..సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో సరికొత్త చిత్రం రానున్న సంగతి విధితమే. ఇందులో భాగంగా త్రివిక్రమ్ దర్శకత్వం  చేయనున్న ఈ మూవీలో ప్రిన్స్ మహేశ్ బాబు రెండు పాత్రల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది. తన సినిమా కెరీర్ లోనే సూపర్ స్టార్ మహేష్ కు ఇదే తొలి డ్యుయల్ రోల్ మూవీ కానుంది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat