వేసవిలో పచ్చి ఉల్లితో ప్రయోజనాలు అనేకం ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు.. *ప్రతిరోజూ పచ్చి ఉల్లిపాయను తింటే చిగుళ్ల సమస్యను తొలగిస్తుంది. *ఆహారంలో చేర్చుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుతుంది. *ఉల్లిపాయలో ఎముకలు బలహీనపడకుండా నిరోధించే గుణాలు ఉన్నాయి. *శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. *ఉల్లిలోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. *మొటిమలు, చర్మ సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
Read More »Ap నూతన మంత్రి వర్గం.. వీళ్లకే అవకాశం
ఏపీలో రాజీనామా చేసిన 24మంత్రుల స్థానంలో ఇవాళ సాయంత్రానికి మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనే దానిపై స్పష్టత రానుంది. రాజన్నదొర, ధర్మాన ప్రసాదరావు, భాగ్యలక్ష్మి, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, చిట్టిబాబు, కారుమూరు నాగేశ్వరరావు, గ్రంధి శ్రీనివాస్, జోగి రమేష్, రక్షణనిధి, విడదల రజనీ, మేరుగ నాగార్జున, కాకాని గోవర్ధన్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాస్, శిల్పా చక్రపాణి, జొన్నలగడ్డ పద్మావతికి పదవులు దక్కుతాయనే ప్రచారం నడుస్తోంది.
Read More »మెగా అభిమానులకు Good News
మెగా అభిమానులకి పండుగలాంటి వార్త ఇది.. స్టార్ హీరోలు ..తండ్రి కొడుకులైన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఆచార్య’ మూవీ ట్రయిలర్ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో ఇటీవల జోరు పెంచిన చిత్ర యూనిట్.. ఏప్రిల్ 24న హైదరాబాద్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని భావిస్తోంది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను …
Read More »దగ్గు తగ్గాలంటే…?
దగ్గు ఇలా తగ్గించేయండి.. పొడి దగ్గు, గొంతులో కఫం ఉంటే ఇంటి చిట్కాల ద్వారా ఈజీగా తగ్గించుకోవచ్చు. –> తులసి ఆకులు తింటే దగ్గు మాయమవుతుంది. –> భోజనం తర్వాత బెల్లం ముక్క తిన్నా ఫలితముంటుంది. –> తేనెలో నల్ల మిరియాల పొడి కలిపి తీసుకున్నా ఫలితం ఉంటుంది.. –> నల్ల మిరియాలు, తేనెకు తోడు… అల్లం కుడా కలిపితే అద్భుతంగా పనిచేస్తుంది. –> వెల్లుల్లి తిన్నా దగ్గుకు ఫుల్ …
Read More »దేశంలో కొత్తగా 1,054 కరోనా కేసులు
దేశంలో కరోనా ప్రభావం స్వల్పంగా ఉంది. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,054 కరోనా కేసులు నమోదయ్యాయి. 29 మంది కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు. ప్రస్తుతం 11,132 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కోటి 85 లక్షల 70 వేల కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది.
Read More »RRR ప్రపంచ రికార్డు
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్,యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, ఆలియా భట్,శ్రియా ,సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా డీవీవీ దానయ్య నిర్మాతగా ఎంఎం కిరవాణి సంగీతం అందించినా ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన భారీ పాన్ ఇండియా సినిమా RRR బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా రూ.1000 కోట్ల (గ్రాస్) క్లబ్ లో అడుగుపెట్టింది. ఈ విషయాన్ని RRR టీం …
Read More »హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్లు పునరుద్ధరణ
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ -సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని వివిధ మార్గాల్లో నిలిచిపోయిన ఎంఎంటీఎస్ రైళ్లను ఈ నెల 11 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఎంఎంటీఎస్ రైళ్లు అన్ని మార్గాల్లోనూ యథావిధిగా నడుస్తాయని పేర్కొన్నారు.
Read More »నిషేధిత డ్రగ్స్ దొరికితే పబ్ నిర్వాహకులను రాష్ట్ర బహిష్కరణ చేస్తాం
నిషేధిత డ్రగ్స్ దొరికితే పబ్ నిర్వాహకులను రాష్ట్ర బహిష్కరణ చేస్తామని మంత్రి శ్రీనివా్‌సగౌడ్ హెచ్చరించారు. డ్రగ్స్‌ను ప్రోత్సహించే వ్యక్తులు తెలంగాణలో ఉండొద్దని, ఎక్కడికైనా పారిపోయాలని స్పష్టం చేశారు. శనివారం ఆయన పబ్ నిర్వాహకులతో టూరిజం ప్లాజా హోటల్‌లో సమావేశం నిర్వహించారు. ‘‘హైదరాబాద్‌లోని 61 పబ్‌లలో నిరంతరం నిఘా పెడుతున్నాం. గతంలో సమావేశం నిర్వహించి, స్పష్టంగా చెప్పినా.. పబ్ నిర్వాహకుల్లో మార్పు రాలేదు. మాకు ఆదాయం ముఖ్యం కాదు. అవసరమైతే అన్ని …
Read More »ఢిల్లీలో రేపు సీఎం కేసీఆర్ దీక్ష
దేశ రాజధాని నగరం యాసంగిలో పండిన వరి ధాన్యాన్ని కేంద్రం 100% కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సోమవారం దీక్ష చేపట్టనుంది. దీక్షలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యనేతలంతా పాల్గొంటారు. పంటి చికిత్స కోసం ఢిల్లీ వెళ్లి, అక్కడే ఉన్న సీఎం కేసీఆర్ కూడా దీక్షలో పాల్గొంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్‌ఎస్ ఈ నెల …
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం KCR శ్రీరామనవమి శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కే చంద్రశేఖర్‌రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని సీఎం తెలిపారు. ‘ధర్మో రక్షతి రక్షితః’ సామాజిక విలువను తూ.చ తప్పకుండా ఆచరించి, ధర్మాన్ని, విలువలను కాపాడేందుకు తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత ప్రజాపాలకుడు సీతారామచంద్రుడు అని పేర్కొన్నారు. భారతీయులకు ఇష్ట దైవమని కీర్తించారు. లోకకల్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్ర …
Read More »