ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ ఇవి పాటించండి *వ్యాయామం ప్రతిరోజూ ఓ గంటపాటు చేయాలి. *పుస్తక పఠనం, గార్డెనింగ్, కుటుంబంతో గడపడానికి * కనీసం రెండు గంటలు కేటాయించాలి. *సమయం తప్పకుండా రోజుకు మూడు సార్లు ఆహారం తినాలి. *ఐదు రకాల పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. *ఏకాగ్రత కోసం ఐదారు నిమిషాలు ధ్యానం చేయాలి *రోజులో కనీసం 7 గ్లాసుల నీళ్లు తాగాలి. 8 గంటలు నిద్రపోవాలి. *రోజులో కనీసం 9వేల …
Read More »రోజూ ఒక ఉసిరి తింటే
రోజూ ఒక ఉసిరి తింటే ఉపయోగాలివే.. ఊపిరితిత్తులు, కంటి వ్యాధుల నివారణకు ఉసిరిని మంచి ఔషధం. ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం త్వరగా ముడతలు పడకుండా చేస్తాయి. ఉసిరికాయల్ని గ్రైండ్ చేసి, తలకి పట్టిస్తే కళ్ల మంటలు తగ్గుతాయి. వెంట్రుకలు బాగా పెరగడంతోపాటు నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి. ఇందులో రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి. ఎముకలు, దంతాలు, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి
Read More »ఉక్రెయిన్ లో చనిపోయిన నవీన్ గురించి బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్లో చనిపోయిన నవీన్ మృతదేహం తరలింపుపై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యుద్ధ ప్రాంతం నుంచి బతికున్న వారిని తీసుకురావడం సవాల్ తో కూడుకున్న పని అని, మృతదేహాన్ని తేవడం ఇంకా కష్టమని చెప్పాడు. విమానంలో మృతదేహం ఎక్కువ స్థలం ఆక్రమిస్తుందని, ఆ ప్లేసులో 10 మంది కూర్చోవచ్చంటూ పేర్కొన్నాడు. గత 4 రోజులుగా నవీన్ డెడ్ బాడీ కోసం కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు.
Read More »ఇంటర్ పాసైనవారికి తెలంగాణ సర్కారు శుభవార్త
కనీస మార్కులతో(35) ఇంటర్ పాసైనవారిని కూడా ఎంసెట్ ర్యాంకులకు అర్హులుగా ప్రకటించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాస్తున్న ప్రతి ఒక్కరికీ ఎంసెట్ కు అర్హత లభిస్తుంది. కరోనాతో రెండేళ్లుగా సరిగ్గా క్లాసులు జరగక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 40 మార్కులు వస్తేనే ఎంసెట్లో ఇంజనీరింగ్ సీటు సంపాదించే వీలుంది.
Read More »బరువు తగ్గడానికి ఈ చిట్కాలు చాలా అవసరం..?
బరువు తగ్గడానికి చాలా మంది జొన్న రొట్టెలు, చపాతీలు తింటుంటారు. వీటితోపాటు సజ్జ రొట్టెలను తీసుకుంటే మంచి ప్రయోజనాలుంటాయి. సజ్జ రొట్టె లేట్గా జీర్ణమవుతుంది కాబట్టి త్వరగా ఆకలి వేయదు. ఫలితంగా బరువు తగ్గొచ్చు. సజ్జల్లో ప్రొటీన్స్, ఫైబర్, మినరల్స్ ఉంటాయి. ఇది గ్లూటెన్ రహిత ఆహారం. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయి. డయాబెటిస్ రోగులకు ఎంతో మంచిది. గ్యాస్ట్రి గ్యాస్ట్రిక్, మలబద్ధకం సమస్యలు రావు.
Read More »మరోసారి సెంచరీ చేజార్చుకున్నరిషబ్ పంత్-ట్వీట్ వైరల్
శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మరోసారి సెంచరీ చేజార్చుకున్నాడు. శ్రీలంకతో తొలి టెస్టులో 96 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీనిపై మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘పిల్లలు పరీక్షల్లో 90కి పైగా మార్కులు సాధిస్తే తల్లిదండ్రులు గర్వపడతారు. లెజెండ్స్ 90+ స్కోర్ చేస్తే దేశం మొత్తం గర్వంగా ఫీలవుతుంది. సెంచరీ చేజారిందని …
Read More »తొలి ఐపీఎల్ ట్రోపిని అందుకున్న వార్న్
ఆకస్మికంగా మృతి చెందిన ఆసీస్ లెజండ్రీ ఆటగాడు స్పిన్నర్ షేన్ వార్న్ కు ఇండియాతో మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్ తొలి సీజన్-2008లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్ వార్న్ వ్యవహరించాడు. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలో దిగిన జట్టును ఫైనల్ కు చేర్చాడు. తుది పోరులో మంచి లైనప్ కలిగిన చెన్నై సూపర్ కింగ్స్న చిత్తు చేసి రాజస్థాన్ జట్టును విజేతగా నిలిపి ఐపీఎల్ తొలి ట్రోఫీని …
Read More »గాలి నాగేశ్వరరావు గా మంచు విష్ణు
తన కొత్త చిత్రం గురించి మంచు విష్ణు ట్విట్టర్లో తెలిపాడు. గాలి నాగేశ్వరరావుగా నటిస్తున్నట్లు తెలుపుతూ ఒక కార్డుని షేర్ చేశాడు. ఈ చిత్రానికి డైరెక్టర్గా ఈషాన్ సూర్య, కథ, స్క్రీన్ ప్లే, క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా కోన వెంకట్, సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని విష్ణు పేర్కొన్నాడు. మోసగాళ్లు చిత్రం తర్వాత అతను మరే సినిమాలోనూ నటించలేదు.
Read More »రెమ్యునరేషన్ పెంచేసిన సమంత
ఇటీవల వరుస సినిమాలతో జోరు మీదున్న సమంత రెమ్యునరేషన్ పెంచేసినట్లు టాక్. ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు డిమాండ్ చేస్తోందట. విజయ్ దేవరకొండతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే సినిమాకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం రూ.3 కోట్లు ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే చెప్పారట. ఇదే బ్యానర్ కింద వచ్చిన పుష్పలో ఐటమ్ సాంగ్ చేసేందుకు సామ్ రూ.1.5 కోట్లు తీసుకుంది. పూజా హెగ్దే రూ.3.5 కోట్లు, రష్మిక …
Read More »జెనీలియా రీఎంట్రీ
తన సహజ నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన క్యూట్ హీరోయిన్ జెనీలియా.సినిమాల్లో నటిస్తూనే విరామం ప్రకటించి పెళ్లి చేసుకున్న తర్వాత సినీ అభిమానుల ముందుకు రాలేదు. తాజాగా సౌత్ లో రీఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి మొదటి సినిమాలో ముఖ్య పాత్రలో ఈ క్యూట్ హీరోయిన్ జెనీలియా నటించనుంది. పాన్ ఇండియా స్థాయిలో ఇది తెరకెక్కనుంది. సత్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన …
Read More »