ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం మొదలైంది. రష్యన్ సైన్యం ఉక్రెయిన్లోకి ప్రవేశించింది. ఉక్రెయిన్ రాజధాని కేవ్పై రష్యా సేనలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడిని గద్దె దింపుతామన్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. మరోవైపు రష్యాకు పొరుగున ఉన్న బాల్టిక్ దేశాలకు అమెరికా 800 మంది సైనికులను, 40 యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను పంపింది.
Read More »రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన నిర్ణయం
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ పై మిలటరీ ఆపరేషన్ (యుద్ధం) ప్రకటించారు. ఉక్రెయిన్ సైనికులు వారి ఆయుధాలను వదిలేసి, ఇళ్లకు వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఉక్రెయిన్ ను ఆక్రమించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. పుతిన్ ప్రకటనతో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటానియో గుటెరస్ అప్రమత్తమయ్యారు. శాంతికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఐరాస సెక్యూరిటీ జనరల్ అత్యవసరంగా భేటీ అయింది.
Read More »పూనమ్ కౌర్ సంచలన ట్వీట్
ప్రముఖ సినీనటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ చేసింది. ‘నేను మనస్ఫూర్తిగా ఆదరించి, ప్రేమించే వ్యక్తులు ఈ పొలిటికల్ లీడర్స్ దగ్గర వాళ్లకు వాళ్లు తక్కువ చేసుకుని, చేతులు కట్టుకుని ఉండటం చాలా బాధనిపిస్తోంది. వ్యక్తిత్వం చంపేసుకోవడం మానెయ్యాలి’ అని రాసి బ్రోకెన్ హార్ట్ సింబల్స్ జోడించింది. కాసేపటికే ఆ ట్వీట్ను డిలీట్ చేసి.. రాజకీయాలు ఎంటర్ టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ రాజకీయాలుగా మారుతున్నాయని ట్వీట్ చేసింది.
Read More »శ్రీలంక జట్టులో కరోనా కలకలం
టీమిండియాతో టీ20 సిరీస్ ముందు శ్రీలంక జట్టులో కరోనా కలకలం రేగింది. లక్నో వేదికగా భారత్, శ్రీలంక మధ్య నేడు తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. లంక స్పిన్నర్ వనిందు హసరంగాకు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో అతడిని ఐసోలేషన్కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. 2 వారాల వ్యవధిలో హసరంగా కరోనా బారినపడటం ఇది రెండోసారి కాగా ఐపీఎల్ లో అతడిని ఆర్సీబీ రూ. …
Read More »పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా మయాంక్ అగర్వాల్
ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్ జట్టుకు మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావన్ ఉన్నప్పటికీ కెప్టెన్సీ రేసులో మయాంకే ముందున్నాడని PTI వార్తా సంస్థ తెలిపింది. దీనిపై త్వరలోనే ప్రకటన ఉంటుందని పేర్కొంది. కాగా, గత సీజన్లలో కెప్టెన్సీ వహించిన కేఎల్ రాహుల్ పంజాబ్ ఫ్రాంఛైజీని వదిలేశాడు.
Read More »రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ
రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. శ్రీలంకతో నేడు జరిగే టీ20 మ్యాచ్లో మరో 37 పరుగులు చేస్తే.. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత సాధించనున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 3,263 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ 3,299 పరుగులతో తొలి స్థానంలో, విరాట్ కోహ్లి 3,296 పరుగులతో రెండో స్థానంలో …
Read More »దొండకాయతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు
దొండకాయతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో ఇప్పుడు తెలుసుకుందాం.. *రక్తపోటును, డయాబెటిస్ను నియంత్రిస్తుంది. *పీచు, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. *ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు హానికర బ్యాక్టీరియాను అడ్డుకుంటాయి. *మానసిక ఆందోళన, మూర్ఛ వ్యాధితో బాధపడేవారికి ఉపయోగకరం *దీనిలోని కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. *ఎముకలకు గట్టిదనాన్ని ఇస్తుంది.
Read More »యుక్త వయసులో ఇది చేయాలి..?
యుక్త వయసులో చేసే ఎక్సర్ సైజులు భవిష్యత్లో ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. యుక్త వయస్సు పిల్లలు రోజుకు గంట లేదా అంతకన్నా ఎక్కువసేపు ఎక్సర్సైజులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సైకిల్ తొక్కడం, డ్యాన్స్, రన్నింగ్, ఏరోబిక్ ఎక్సర్సైజులు వంటివి ఉండేలా చూసుకోవాలి. తర్వాత కొద్ది నిమిషాలు వెయిట్ లిఫ్టింగ్, పుషప్స్ వంటివి చేస్తే జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు.
Read More »మీరు Break Fast ను తీసుకోవడం లేదా…?
కొంత మంది Break Fast ను తీసుకోవడం తప్పిస్తారు. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ మానేస్తే మహిళల్లో టైప్- 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్పాహారం తీసుకోకపోవడం వల్ల క్యాన్సర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. యువత బ్రేక్ఫాస్ట్ తీసుకోకపోతే ఏకాగ్రత దెబ్బతింటుంది. మైగ్రేన్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. బ్రేక్ఫాస్ట్ మానేయడం వల్ల బరువు కూడా పెరిగే అవకాశం ఉంది.
Read More »మంత్రి హరీశ్‌రావు డైనమిక్ లీడర్- సీఎం కేసీఆర్ ప్రశంసలు
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. హరీశ్‌రావు డైనమిక్ లీడర్.. చురుకైన మంత్రి అంటూ కేసీఆర్ కొనియాడారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును జాతికి అంకింత చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను గాలిలో కట్టడం సాధ్యం కాదు. భూమ్మీదనే కట్టాలి. ముంపునకు గురైన గ్రామాలకు న్యాయం చేస్తాం. భూనిర్వాసితులకు న్యాయం చేస్తాం. చరిత్రలో ఇప్పటి …
Read More »