Home / INTERNATIONAL

INTERNATIONAL

పెరూలో కోవిడ్ వ‌ల్ల రెండు ల‌క్ష‌లు మంది మృతి

 లాటిన్ దేశం పెరూలో కోవిడ్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య రెండు ల‌క్ష‌లు దాటింది. ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఆ దేశంలో కొత్త‌గా 25 మంది మ‌ర‌ణించారు. దీంతో ద‌క్షిణ అమెరికా దేశ‌మైన పెరూలో మృతుల సంఖ్య రెండు ల‌క్ష‌లు దాటింది. మార్చి 2020 నుంచి ఆ దేశం క‌రోనా మ‌ర‌ణాల‌ను లెక్కిస్తున్న‌ది. ఆ దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 22 …

Read More »

బ్రిటన్‌లో మళ్లీ కరోనా దూకుడు

బ్రిటన్‌లో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో గత ఎనిమిది రోజులుగా 40 వేలకుపైగా కేసులు నమోదవుతుండగా, తాజాగా ఆ సంఖ్య 52 వేలు దాటింది. యూకేలో గురువారం కొత్తగా 52,009 మంది కరోనా బారినపడ్డారు. మరో 115 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సఖ్య 86,41,221కి చేరగా, 1,39,146 మంది మృతిచెందారు. కాగా, దేశంలో కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయని, పరిస్థితిని నిషితంగా గమనిస్తున్నామని బ్రిటన్‌ …

Read More »

london లో ఘనంగా చేనేత బతుకమ్మ-దసరా సంబురాలు

తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (టాక్‌) ఆధ్వర్యంలో లండన్‌లో సోమవారం చేనేత బతుకమ్మ-దసరా సంబురాలను ఘనంగా నిర్వహించారు. యూకే నలుమూలల నుంచి సుమారు 600లకుపైగా ప్రవాస కుటుంబాలు ఈ వేడుకలకు హాజరయ్యాయి. భారత సంతతికి చెందిన బ్రిటిష్‌ ఎంపీలు వీరేంద్రశర్మ, సిమా మల్హోత్రా, స్థానిక హాన్‌స్లో మేయర్‌ బిష్ణు గురుగ్‌ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌ స్ఫూర్తితో చేనేతకు చేయూతనిచ్చేందుకు ప్రతి ఏడాదిలాగే చేనేత దుస్తులు ధరించి బతుకమ్మ- …

Read More »

మలేరియా వ్యాక్సిన్‌కు WHO ఆమోదం

పిల్లల్లో ప్రాణాంతకంగా పరిణమించిన మలేరియాను నిర్మూలించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) విశేషంగా కృషి చేస్తున్నది. దీనిలో భాగంగా ప్రపంచంలో మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్‌ (ఆర్టీఎస్‌, ఎస్‌/ఏఎస్‌01) కు డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్‌ను మలేరియా ఎక్కువగా ప్రభావితమైన ఆఫ్రికన్ దేశాల నుంచి ప్రారంభించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇది సక్సెస్‌ కావడంతో ప్రపంచవ్యాప్తంగా మలేరియా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు నిధుల సమీకరణపై దృష్టి పెట్టనున్నది. తద్వారా ఈ టీకా …

Read More »

న్యూజిలాండ్‌లో ఆరు నెలల తర్వాత తొలి కరోనా మరణం

న్యూజిలాండ్‌లో ఆరు నెలల తర్వాత తొలి కరోనా మరణం నమోదైంది. ఆ దేశ ఆరోగ్య అధికారులు శనివారం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 90 ఏండ్ల మహిళ కరోనా సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నదని తెలిపారు. వెంటిలేటర్ లేదా ఇంటెన్సివ్ కేర్ వ్యవస్థపై ఆమె లేకపోయినా శుక్రవారం రాత్రి ఆక్లాండ్ ఆసుపత్రిలో మరణించినట్లు చెప్పారు. న్యూజిలాండ్‌లో కోవిడ్ -19తో చనిపోయిన 27వ వ్యక్తి ఆ మహిళ అని, ఈ ఏడాది ఫిబ్రవరి …

Read More »

కోవిడ్‌19 నివార‌ణ‌లో కీల‌కం కానున్న‌ అత్యంత విష సర్పం

అత్యంత విష స‌ర్ప‌మే.. కోవిడ్‌19 నివార‌ణ‌లో కీల‌కం కానున్న‌ది. బ్రెజిల్ అడ‌వుల్లో క‌నిపించే స‌ర్పం జ‌రారాకుసో ( Jararacussu pit viper )కు చెందిన విషంతో కోవిడ్‌19ను అంతం చేయ‌వ‌చ్చు అని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధ్య‌య‌న నివేదిక‌ను సైంటిఫిక్ జ‌ర్న‌ల్ మాలిక్యూల్స్‌లో ప్ర‌చురించారు. ర‌క్త‌పింజ‌ర జ‌రారాకుసో విషంలో ఉండే అణువులు.. కోవిడ్ వైర‌స్ వ్యాప్తిని స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఆ స‌ర్ప విష అణువులు కోతుల్లో 75 …

Read More »

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంచలన ప్రకటన

కాబూల్‌ విమానాశ్రయంలో పేలుళ్లకు కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. పేలుళ్లలో మృతిచెందిన అమెరికా సైనికులను హీరోలుగా అభివర్ణించారు. ఉగ్రమూకలను వేటాడి మరీ ప్రతీకారం తీర్చుకుంటామని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. ఐఎస్‌ఐఎస్‌ నాయకులను హతమార్చాలని అమెరికన్‌ ఆర్మీని ఆదేశించారు. ‘కాబుల్ ఎయిర్‌పోర్టులో జరిగిన పేలుళ్లలో మృతిచెందిన అమెరికా సైనికులు హీరోలు. ఈ ఘటనకు కారకులైన వారిని …

Read More »

 ఆఫ్ఘనిస్తాన్‌ లో దారుణం -ఒక వాటర్‌ బాటిల్‌ దాదాపు రూ.3వేలు..ప్లేట్‌ రైస్‌కు రూ.7500

 ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ప్రజలు భయాందోళన చెందుతూ ప్రాణాలు కాపాడుకునేందుకు దేశాన్ని వీడుతున్నారు. తాలిబన్లు అన్ని మార్గాలను మూసివేడంతో అందరూ కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. ఇక్కడ ఎయిర్‌పోర్టులో మంచినీళ్లు, ఆహారానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరో వైపు ధరలు చుక్కలనంటుతుండడంతో ఆకలికి అలమటించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం విమానాశ్రయంలో ఒక వాటర్‌ బాటిల్‌ ధర 40 డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.3వేలు)కు …

Read More »

ఆఫ్ఘన్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన 16 మందికి కరోనా

ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి భారతీయుల తరలింపును కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఆఫ్ఘన్‌ గతవారం తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. దీంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. రక్షణ కరువడంతో ఆఫ్ఘన్‌ పౌరులతోపాటు, వివిధ కారణాల దృష్ట్యా అక్కడికి వెళ్లినవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వలసబాటపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం మరో 78 మంది భారత్‌కు వచ్చారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా 16 మందికి పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. …

Read More »

క‌రోనా వైర‌స్‌ డెల్టా వేరియంట్ వ్యాప్తిని చైనా స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకుంటోందా..?

క‌రోనా వైర‌స్‌ డెల్టా వేరియంట్ ( Delta Variant ) వ్యాప్తిని చైనా స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకుంటోంది. సోమ‌వారం రోజున ఆ దేశంలో స్థానికంగా ఎటువంటి పాజిటివ్ కేసు న‌మోదు కాలేదు. జూలై త‌ర్వాత జీరో కేసులు నమోదు కావ‌డం ఇదే తొలిసారి. నేష‌న‌ల్ హెల్త్ క‌మిష‌న్ ఈ విష‌యాన్ని చెప్పింది. జూలై 20వ తేదీ నుంచి చైనాలో డెల్టా వేరియంట్ శ‌ర‌వేగంగా వ్యాపిస్తోంది. నాన్‌జింగ్ న‌గ‌రంలో ఉన్న ఎయిర్‌పోర్ట్ సిబ్బందిలో …

Read More »