రైల్వే లైన్ల మంజూరులో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోదక్కుమార్ అన్నారు. ‘రాష్ట్రానికి రైల్వే లైన్లు మంజూరు చేయాలి. తెలంగాణ దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. దేశంలోని పలు ప్రాంతాల నుంచి TSకు పెద్ద ఎత్తున వలస వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్త రైల్వే లైన్లు అవసరం’ అని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్కు …
Read More »నందమూరి బాటలో అల్లు వారి అబ్బాయి
సినిమాలతో స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్న నందమూరి నట వారసులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లు హోస్టులుగానూ మంచి ఆదరణ పొందారు. ఇక బాలయ్య ‘అన్ పబుల్’ అయితే సూపర్ సక్సెస్ అయింది. వీరిద్దరిలా అల్లు అర్జున్ కూడా త్వరలో ‘ఆహా’లో ఓ షోను హోస్ట్ చేస్తాడని ప్రచారం జరుగుతోంది. కుటుంబ సంస్థ కావడంతో ఇందుకు బన్నీ సుముఖంగా ఉన్నాడట. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More »అఖండ మూవీ 103 సెంటర్స్ లో 50 రోజులు పూర్తి
అఖండ మూవీ 103 సెంటర్స్లో 50 రోజులను పూర్తి చేసుకుని విజయపథంలో సాగుతోంది. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ అఖండ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటి వరకు రూ.200 కోట్ల మార్కును దాటి రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ RTC క్రాస్రోడ్స్ సుదర్శన్ థియేటర్తో పాటు US, UK, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ 50 డేస్ సెలబ్రేషన్స్ను భారీ ఎత్తున ప్లాన్ చేశారు బాలయ్య ఫ్యాన్స్.
Read More »ఈ ఏడాది పత్తి రైతుల ఇంట సిరుల పంట
ఈ ఏడాది పత్తి రైతుల ఇంట సిరుల పంట పండుతోంది. కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో క్వింటాలు పత్తి తాజాగా గరిష్ఠంగా రూ.10,521 పలికింది. ఇది దేశంలోనే అత్యధిక ధర అని మార్కెట్ వర్గాలు తెలిపాయి. వర్షాలకు పంట నష్టపోవడంతో స్పిన్నింగ్ మిల్లుల్లో దూది కొరత ఏర్పడింది. దీంతో ‘ వ్యాపారుల మధ్య పోటీ ఏర్పడి ధర పెరుగుతోంది. మంచి ధర వస్తుండటంతో అన్నదాతల ముఖాల్లో ఆనందం కన్పిస్తోంది.
Read More »వాహనదారులపై మళ్లీ పెట్రో పిడుగు
వాహనదారులపై మళ్లీ పెట్రో పిడుగు పడనుంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 4 వారాల్లో ఏకంగా 25 శాతం పెరిగి ఏడేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ చుక్కలనంటే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. గతేడాది దేశంలో పెట్రోల్ లీటర్ రూ.110 దాటడంతో వాహనదారులు బెంబేలెత్తారు. తర్వాత కాస్త తగ్గడంతో ఉపశమనం లభించినా.. ఇప్పుడు మళ్లీ రేట్లు పెరిగితే సామాన్యులపై భారం తప్పదు.
Read More »36 బంతుల్లో 10 సిక్సర్లు, 9 ఫోర్లతో జేసన్ రాయ్ విధ్వంసం
ఇంగ్లాండ్ బ్యాటర్ జేసన్ రాయ్ 36 బంతుల్లో 10 సిక్సర్లు, 9 ఫోర్లతో విధ్వంసం సృష్టించాడు. మొత్తం 47 బంతులను ఎదుర్కొని 115 పరుగులు చేశాడు. వెస్టిండీస్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్క ముందు జరిగిన వార్మప్ మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు 137 రన్స్క చేతులెత్తేసింది.
Read More »విరాట్ కోహ్లి కెప్టెన్సీ వదులుకోవడానికి గల కారణాలు ఇవే..?
టీమిండియా పరుగుల మిషన్ విరాట్ కోహ్లి కెప్టెన్సీ వదులుకోవడానికి గల కారణాలను అనేక మంది పలు రకాలుగా చెబుతున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ స్టెయిన్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. తన కుటుంబానికి అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని తెలిపాడు. ప్రస్తుత బయోబబుల్స్ కారణంగా కుటుంబానికి దూరం కావడం ఇబ్బందికరంగా ఉంటుందన్నాడు. కెప్టెన్సీ నుంచి వైదొలిగాక విరాట్ తన కుటుంబం, బ్యాటింగ్పై దృష్టి సారిస్తాడని వివరించాడు
Read More »డిసెంబర్ నాటికి దేశంలో 5.3కోట్ల మంది నిరుద్యోగులు
కరోనా కారణంగా 2021 డిసెంబర్ నాటికి దేశంలో 5.3కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తెలిపింది. ఇందులో 3.5 కోట్ల మంది ఉద్యోగం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నారు.. 1.7కోట్లమంది జాబ్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదంది. కాగా ఉద్యోగ వేటలో అంత యాక్టివ్గా లేనివారిలో సగానికి పైగా మహిళలే ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
Read More »కర్హాల్ నియోజకవర్గం నుంచి అఖిలేశ్ యాదవ్ పోటీ
నిన్న మొన్నటివరకు అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని చెబుతూ వచ్చిన సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. ఆయన కర్హాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఆయన ప్రస్తుతం అజంగఢ్ ఎంపీగా ఉన్నారు. గతంలో యూపీ సీఎంగా చేసినప్పటికీ.. మండలి నుంచి ప్రాతినిథ్యం వహించారు.
Read More »మరోకసారి సంచలనం సృష్టించిన ఎంపీ సుబ్రమణియన్ స్వామి
ప్రస్తుత కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు ప్రజలకు ఇన్కమ్ ట్యాక్స్ ను రద్దు చేయడం మంచిదని రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి అభిప్రాయపడ్డారు. రానున్న ఆర్థిక సంవత్సరం మొదటి రోజే ఈ నిర్ణయం ప్రకటిస్తే ఆర్థిక ప్రగతికి బలం ఇచ్చినట్లు అవుతుందన్నారు. ట్యాక్సేషన్ బదులుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వనరుల్ని పెంచుకోవచ్చని గతంలోనూ ప్రభుత్వానికి సూచించానని తెలిపారు.
Read More »