ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచే కోవిడ్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఈ నెల 31 వరకు రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉంటుంది. 50 శాతం సీటింగ్తో సినిమా హాళ్లు నడుస్తాయి. వివాహాలు, శుభకార్యాలు, మతపరమైన కార్యక్రమాల్లో గరిష్టంగా 200 మందికి అనుమతి ఉంటుంది. మాస్క్ ధరించకుంటే రూ. 100 జరిమానా విధిస్తారు. గత వారమే కర్ఫ్యూ ఉత్తర్వులిచ్చినప్పటికీ.. పండుగ కారణంగా నేటి …
Read More »Junior NTR తో నేషనల్ క్రష్
కన్నడ సొగసరి రష్మిక మందన్న పట్టిందల్లా బంగారమే అవుతున్నది. అరంగేట్రం చేసిన అనతికాలంలోనే ఈ భామ జాతీయ సినీ యవనికపై దూసుకుపోతున్నది. దక్షిణా దిలో తిరుగులేని ఫాలోయింగ్ను సొంతం చేసుకున్న ఈ అమ్మడు ‘మిషన్ మజ్ను’ ‘గుడ్బై’ వంటి బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ దేశవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని సంపాదించుకుంది. వరుసగా భారీ ఆఫర్లతో కెరీర్లో దూసుకుపోతున్న ఈ సొగసరి తాజాగా తెలుగులో మరో ప్రతిష్టాత్మక చిత్రంలో కథానాయికగా ఎంపికైనట్లు తెలిసింది. ఎన్టీఆర్ …
Read More »విడిపోయిన ధనుష్ దంపతులు
సూపర్ స్టార్,ప్రముఖ నటుడు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య,తమిళ స్టార్ హీరో ధనుష్ దంపతులు తమ వివాహ జీవితానికి ముగింపు పలికారు. తాము విడాకులు తీసుకుంటున్నట్లు ఇద్దరూ సోషల్ మీడియాలో లేఖలు విడుదల చేశారు. గత 18 ఏళ్లుగా స్నేహితులుగా, భార్యాభర్తలుగా కలసి ఉన్న తాము ప్రస్తుతం వేర్వేరు మార్గాల్లో వెళ్తున్నట్లు ఐశ్వర్య పేర్కొన్నారు. తమ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కోరారు. వారు విడిపోవడానికి గల కారణాలు తెలియలేదు.
Read More »మాజీ మంత్రి దేవినేని ఉమ కి కరోనా పాజిటీవ్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ కరోనా బారినపడ్డారు. ఆయన కోవిడ్ కు సంబంధించిన టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆయన తన వ్యక్తిగత సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. డాక్టర్ల సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నానన్నారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా …
Read More »చంద్రబాబుకు కరోనా పాజిటీవ్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోవిడ్ బారిన పడ్డారు. మైల్డ్ సింప్టమ్స్ ఉండగా టెస్టు చేయించుకుంటే పాజిటివ్ గా తేలిందని ఆయన తన అధికారక ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని వెల్లడించారు. ఇక, మాజీ మంత్రుల్య్ దేవినేని ఉమ, నారా లోకేష్ నాయుడు లకు సైతం కరోనా …
Read More »తెలంగాణలోని సర్కారు బడులకు మహర్ద
తెలంగాణలో ఉన్న అన్ని ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యాబోధన, మౌలిక వసతుల కల్పనకు ‘మన ఊరు-మన బడి’ పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నది.. ఇందుకోసం రూ.7,289 కోట్లు కేటాయించనున్నారు .రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ స్కూళ్లలో రూ.7,300కోట్లతో మౌలిక వసతులు కల్పన ..మన ఊరు -మన బడి విధి విధానాలతో మారనున్న ప్రభుత్వ స్కూళ్లుఈ పథకంలో భాగంగా మూడేండ్లలో …
Read More »సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన రద్దు
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన రద్దయింది. వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని పరిశీలించేందుకు ఈరోజు వరంగల్ జిల్లాల్లో పర్యటించాలని నిన్న కేసీఆర్ నిర్ణయించారు. కాగా.. ఇతర కారణాల వల్ల ఆ పర్యటన రద్దయిందని అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, ఇతర వ్యవసాయశాఖ అధికారులు మాత్రం జిల్లాలో పర్యటించి పంటపొలాలను పరిశీలించనున్నారు.
Read More »దేశంలో కరోనా థర్డ్ వేవ్ విజృంభణ
దేశంలో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. రోజుకి 2లక్షలకుపైగా వస్తున్న కొత్త కేసుల సంఖ్య కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,38,018 కేసులు నమోదయ్యాయి. అయితే, నిన్నటితో పోలిస్తే.. 20,071 కేసులు తక్కువగా వచ్చాయి. కరోనాతో 310 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 17,36,628 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 14.43%గా ఉంది. ఇక, ఒక్క రోజులో 1,57,421 మహమ్మారి నుంచి కోలుకున్నారు.
Read More »సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ మేరకు మంత్రులు, అధికారులు ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రణ తీసుకోవాల్సిన చర్యలు, దవాఖానల్లో వసతులు, ఆక్సిజన్, మందుల లభ్యత, వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఆసుపత్రుల్లో మెరుగుపరచాల్సిన మౌలిక వసతులపై మంత్రిమండలి చర్చించనున్నది. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం జిల్లాల, జోన్ల కేటాయింపులు పూర్తయిన నేపథ్యంలో వచ్చిన అప్పీళ్లు, స్పౌజ్ కేసులు, ఉద్యోగాల …
Read More »ఢిల్లీలో తగ్గుతున్న కరోనా కేసులు
దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వీకెండ్ కర్ఫ్యూ, ముందస్తు ఆంక్షలు వంటి కారణాలతో కేసులు తగ్గినట్లు మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు. మరో 3-4 రోజులు గమనించి.. కేసులు 15వేలకు చేరినప్పుడు ఆంక్షలు సడలిస్తామన్నారు. గత నెల రోజుల్లో రోజుకు 60 వేల నుంచి లక్ష వరకు పరీక్షలు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. కాగా ఢిల్లీలో నిన్న 20,718 కరోనా కేసులు నమోదు కాగా.. …
Read More »