తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో కండక్టర్ కి కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. హన్మకొండ-చెన్నూరు RTC బస్సులో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కండక్టర్.. ప్రయాణికులు దిగాక డ్రైవర్ తో కలిసి టీ తాగారు. ఆ దగ్గర్లోనే ఉన్న కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రం చూసి.. ఎలాంటి లక్షణాలు లేకపోయినా కరోనా టెస్టు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ తేలగా.. ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు.
Read More »Upలో Spకి రాకేశ్ టికాయత్ మద్ధతు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ-రాష్ట్రీయ లోక్ దళ్ కూటమికి మద్దతిస్తున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ అధినేత రాకేశ్ టికాయత్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు జరిగిన రైతుల ఉద్యమంలో టికాయత్ కీలకపాత్ర పోషించారు. సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నప్పటికీ తమ ఉద్యమం ఆపబోమని ప్రకటించిన టికాయత్.. ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుత అధికార బీజేపీ వ్యతిరేక పార్టీకి మద్దతిచ్చారు.
Read More »షణ్ముఖ్, దీప్తి సునయన లవ్ బ్రేకప్ పై సిరి హనుమంతు సంచలన వ్యాఖ్యలు
తెలుగులో మా టీవీలో ఇటీవల ప్రసారమైన బిగ్ బాస్ కంటెస్టెంట్లు షణ్ముఖ్, దీప్తి సునయన లవ్ బ్రేకప్ పై సిరి హనుమంతు తొలిసారి స్పందించింది. హౌస్ లో షణ్ముఖ్-సిరి మధ్య ఏర్పడిన క్లోజ్ రిలేషన్ వల్లే దీప్తి బ్రేకప్ చెప్పిందని సోషల్ మీడియాలో సిరిపై తీవ్రంగా ట్రోలింగ్ జరుగుతోంది. అయితే.. వాళ్లిద్దరి బ్రేకప్ కి తానే కారణం అనడం కరెక్ట్ కాదని ఆమె ఈ సందర్భంగా చెప్పింది. వాళ్లది కేవలం …
Read More »దాదాపు ఐదేళ్ల తర్వాత Junior NTR
దాదాపు ఐదేళ్ల తర్వాత Hit చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో Junior NTR మరో సినిమా చేయబోతున్నాడు. ‘RRR’ వల్ల ఎన్టీఆర్ వేరే ప్రాజెక్ట్ మొదలుపెట్టలేదు. అయితే.. జక్కన్న సినిమా రిలీజ్ వాయిదా పడటంతో ఇప్పుడు కొరటాలతో మూవీ స్టార్ట్ చేసే ప్లాన్ చేస్తున్నారు. హీరోయిన్ ఎవరనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే.. బాలీవుడ్ ఎన్టీఆర్ సరసన బ్యూటీ అలియా భట్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే …
Read More »సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కరోనా
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కరోనా సోకింది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పడంతో ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని, కార్యకర్తలు.. నాయకులు ఆందోళన చెందొద్దని కోరారు. క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కార్యకర్తలను కలుస్తానని భట్టి తెలిపారు.
Read More »కాంగ్రెస్ లోకి ఎంపీ డీఎస్
తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ త్వరలో సొంతగూటికి వెళ్లనున్నారు. ఈనెల 24న సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరే అవకాశం కనిపిస్తోంది. గతంలో P.C.C అధ్యక్షుడిగా, మంత్రిగా కాంగ్రెస్లో కీలక పాత్ర పోషించిన ఆయన 2015లో తెరాసలో చేరారు. తెరాస నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన డీఎస్.. కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నారు.
Read More »ఏపీలో విద్యాసంస్థలు యథావిథిగా ప్రారంభం
ఏపీలో విద్యాసంస్థలు యథావిథిగా ప్రారంభం అవుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ‘టీచర్లకు 100% వ్యాక్సినేషన్ పూర్తైంది. 15-18 ఏళ్ల మధ్య వయసు ఉన్న విద్యార్థులకు 90శాతానికి పైగా వ్యాక్సిన్ ఇచ్చాం. కరోనా పట్ల అప్రమత్తంగా ఉన్నాం. విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దు. అమెరికాలో లక్షల కేసులు వస్తున్నా విద్యాసంస్థలు మూసివేయలేదు. అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం’ అని ఆయన అన్నారు.
Read More »వ్యాక్సిన్ తీస్కున్న అజాగ్రత్త వద్దు
దేశంలో, రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా వైరస్ సోకుతుంది. కొందరు తాము వ్యాక్సిన్ తీసుకున్నాములే అని అజాగ్రత్తగా ఉంటున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నా.. భౌతికదూరం పాటించడం, మాస్క్ ధరించడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం వంటి నిబంధనలను తప్పక పాటించండి. తుమ్మినా, దగ్గినా చేతిని కాకుండా మోచేతిని అడ్డుపెట్టుకోండి.
Read More »దేశంలో కరోనా విలయతాండవం
దేశ వ్యాప్తంగా రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి.. ఈ క్రమంలో దేశంలో రాష్ట్రాల వారీగా కరోనా కేసులు నమోదు ఇలా ఉంది.. మహారాష్ట్ర – 41,327 కేసులు కర్ణాటక – 34,047 కేసులు తమిళనాడు – 23,975 కేసులు కేరళ – 18,123 కేసులు గుజరాత్ – 10,150 కేసులు హర్యాణా 9,000 కేసులు ఆంధ్రప్రదేశ్ – 4,570 కేసులు గోవా – 3,232 కేసులు …
Read More »ఏపీలో ప్రముఖులకు కరోనా
ఏపీలో ప్రకాశం జిల్లాలో పలువురు రాజకీయ నేతలు కరోనా బారిన పడ్డారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు కరోనా రావడంతో హోం ఐసోలేషన్లోకి వెళ్లారు. కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డికి కూడా పాజిటివ్ రాగా.. మంత్రి బాలినేని భార్యకు కరోనా సోకడంతో ఆమెతో పాటు మంత్రి కూడా హోం ఐసోలేషన్లో ఉన్నారు. అటు మంత్రి అవంతి, ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాద్, అంబటి రాంబాబు ఇటీవలే కరోనా బారిన పడ్డారు.
Read More »