తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా మరో 12కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79కి చేరింది. వీరిలో 27మంది బాధితులు కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది.
Read More »Megastar సంచలన వ్యాఖ్యలు
”సినిమా ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను.. పెద్దరికం పదవి నాకొద్దు.. ఆ స్థానమే నాకొద్దు.. ఆపదలో ఉంటే మాత్రం ఎవరినైనా తప్పకుండా ఆదుకుంటా” అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కరోనాతో ఎంతోమంది సినీ కార్మిక కుటుంబాలు ఇబ్బందుల్లో పడ్డాయని, అలాంటివారికి ఏదైనా చేయాలన్నదే తన తాపత్రయన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అన్ని విభాగాల సభ్యుల కుటుంబాలకు యోధా డయాగ్నిస్టిక్స్ ల్యాబ్స్‌లో టెస్టులు, చికిత్సకు 50% రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆయన …
Read More »మహ్మద్ సిరాజ్ కి గవాస్కర్ చురకలు
దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ ఐదోరోజు ఆటలో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ ప్రవర్తించిన తీరును బ్యాటింగ్ దిగ్గజం గవాస్కర్ తప్పుపట్టాడు. సౌతాఫ్రికా వైస్ కెప్టెన్ బవుమా పరుగు కోసం ప్రయత్నించకున్నా..సిరాజ్ అతడివైపు బంతి విసరడమేమిటని సన్నీ ప్రశ్నించాడు. సిరాజ్ బౌలింగ్‌లో డిఫెన్సివ్‌గా ఆడిన బవుమా పరుగుకోసం ప్రయత్నించకున్నా.. ఫాలో అప్‌లో బంతిని అందుకున్న భారత పేసర్ దానిని బవుమాపైకి విసిరాడు. దాంతో బంతి ఎడమ పాదానికి తగిలి సౌతాఫ్రికా బ్యాటర్ …
Read More »బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ సెటైర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరంలో షేక్‌పేట్-రాయదుర్గం ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన తర్వాత మంత్రి కేటీఆర్ రాయదుర్గం వైపు నుంచి ఫ్లై ఓవర్ ఎక్కి షేక్‌పేట వైపు వెళ్లారు. ప్రయాణంలో వంతెనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తీసి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఫ్లై ఓవర్ నిర్మాణంలో ఎస్‌ఆర్‌డీపీ ఇంజనీరింగ్ అధికారుల బృందం గొప్పగా కృషి చేసిందని కొనియాడారు. అదే సమయంలో, ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో దయచేసి ఈ ఫొటోలను …
Read More »కాజల్ అభిమానులకు శుభవార్త
టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకొన్న సంగతి తెలిసిందే. పెళ్ళయినప్పటి నుంచి సినిమాలు తగ్గించి.. ప్రతీ వెకేషన్‌ను భర్తతో ఆస్వాదించింది. నిన్న (శనివారం) నూతన సంవత్సరాది సందర్భంగా.. కాజల్ అభిమానులకు, నెటిజెన్స్ కు గౌతమ్ ఒక హింటిచ్చాడు. కాజల్ అగర్వాల్ ఫోటో ను షేర్ చేస్తూ తాము 2022 సంవత్సరం గురించి ఎదురుచూస్తున్నామని వ్యాఖ్యని జతచేశాడు. కాజల్ గర్భిణీ అనేలా …
Read More »Pavan అభిమానులకు బ్యాడ్ న్యూస్
ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 7న విడుదల కావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కరోనా కొత్త వైరస్ ఒమైక్రాన్ విస్తృతి కారణంగా పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా రూపొందుతున్న ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని ముందు ప్రకటించిన జనవరి 12న రిలీజ్ చేస్తారనే టాక్ మొదలైంది. కానీ, ఇది నిజం కాదని తెలుస్తోంది. ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని నిర్మిస్తున్న సితార …
Read More »రేపు ఢిల్లీకి సీఎం జగన్
ఏపీ సీఎం ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు సోమవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయిట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా ఏపీ,తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, ప్రాజెక్టుల వ్యవహారంతో పాటు ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర పెద్దలతో సీఎం జగన్ చర్చింనున్నట్లు సమాచారం. ముఖ్యంగా …
Read More »అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేసిన వారికి రూ.22 లక్షలు
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేసిన వారికి రూ.22 లక్షలు ఇస్తామని పలు హిందూ సంఘాల ప్రతినిధులు ప్రకటించాయి. నమాజ్‌ను వ్యతిరేకిస్తూ, నాథూరాం గాడ్సేను పొగుడుతూ ఆయా సంఘాల నేతలు గురుగ్రామ్‌లో శనివారం నిరసనలు వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీని కించపరిచే వ్యాఖ్యల్ని చేసినందుకు గత నెల 30న అరెస్టు చేసిన కాళీచరణ్ మహారాజ్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 22 సంఘాలకు చెందిన ఆందోళనకారులు ఈ నిరసనల్లో …
Read More »మరోసారి మానవత్వం చాటుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి….
పర్వతగిరి మండల కేంద్ర సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్వతగిరి గ్రామ శివారులో కారు, బైక్ ఢీకొని ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అదే మార్గంలో వెళ్తున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు వెంటనే క్షతగాత్రుల వద్దకు వెళ్లి అంబులెన్సు ఫోన్ చేసి బాధితులను పరామర్శించారు. అంబులెన్స్ వచ్చే వరకు అక్కడే ఉండి, ఎంజీఎం సూపరేంటెండ్ గారికి ఫోన్ చేసి రోడ్డు …
Read More »షణ్ముక్ జశ్వంత్, దీప్తి సునయనకి గుడ్ బై..?
బిగ్ బాస్ కంటెస్టెంట్లు షణ్ముక్ జశ్వంత్, దీప్తి సునయన విడిపోయారు. ఇద్దరు విడిపోతున్నట్లు ఇన్స్టాలో దీప్తి సునయన తెలిపింది. షణ్ముక్తో బ్రేకప్పై పోస్ట్ పెట్టిన ఆమె.. ‘ఇద్దరం ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. మా వ్యక్తిగత జీవితాల్లో ముందుకెళ్లాలి అనుకుంటున్నాం. ఐదేళ్లు ఎంతో సంతోషంగా ఉన్నాం. కలిసి ఉండటానికి ప్రయత్నించాం. ఇద్దరి దారులు వేరని తెలుసుకున్నాం. ఇది మాకెంతో క్లిష్ట సమయం’ అని చెప్పింది
Read More »