సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్ డీకాక్ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. భారత్ తో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు డీకాక్ ప్రకటించాడు. వన్డేలు, టీ20లు ఆడనున్నట్లు ఈ 29 ఏళ్ల వికెట్ కీపర్ తెలిపాడు. కాగా, ఇప్పటివరకు 54 టెస్టులు ఆడిన డీకాక్.. 3,300 రన్స్ చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 22 …
Read More »సొంతగూటికి మాజీ మేయర్ రవీందర్ సింగ్
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ సీఎం కేసీఆర్ ను కలిశారు. దీంతో ఆయన మళ్లీ టీఆర్ఎస్ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రవీందర్ సింగ్ టీఆర్ఎస్కు రెబెల్ గా పోటీ చేశారు. ఈ క్రమంలోనే పార్టీపై, మంత్రి గంగులపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయనకు బీజేపీ కూడా మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీలో చేరతారని వార్తలొచ్చాయి. కానీ తాజాగా సీఎం …
Read More »సంక్రాంతి తర్వాత ఆర్టీసీ ఛార్జీల పెంపు
తెలంగాణలో ఇప్పటికే విద్యుత్ ఛార్జీల పెంపు ఖాయం కాగా, ప్రజలపై మరో భారం పడనుంది. సంక్రాంతి తర్వాత ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రకటన వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పల్లెవెలుగు బస్సులకు కి.మీ.కు 25 పైసలు, ఎక్స్ప్రెస్ ఆ పైన బస్సులకు కి.మీ.కు రూ.30 పైసల చొప్పున పెంచాలన్న TSRTC ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వానికి చేరగా, అనుమతి రావాల్సి ఉంది. సంక్రాంతి తర్వాత దీనికి సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం.
Read More »ఏపీలో మందుబాబులకు Good News
ఏపీలో నూతన సంవత్సరం సందర్భంగా మద్యం దుకాణాలు, బార్ల సమయాన్ని ప్రభుత్వం పొడిగించింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు తెరిచి ఉంచేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. సాధారణంగా బార్లు ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు తెరిచి ఉంటాయి. ఇవాళ ఒక్క రోజు గంట సమయం పెంచారు. అలాగే మద్యం దుకాణాలు రాత్రి 9 గంటలకే మూసేయాల్సి ఉండగా 10 గంటల వరకు …
Read More »దేశానికే ఆదర్శం తెలంగాణ రైతు బంధు పథకం….
దేశ ఆర్ధిక వ్యవస్థకి ప్రధానమైన వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయాలి….. వ్యవసాయాన్ని రైతులకు లాభసాటిగా మార్చాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుకు వెళ్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు అన్నారు. పర్వతగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రైతుల ఖాతాలలో రైతు బందు డబ్బులు జమ చేస్తున్న సందర్బంగా సీఎం కేసీఆర్ గారికి కృతఙ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్ర పటానికి ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు పాలాభిషేకం …
Read More »శరీరంలో రక్త ప్రసరణను ఇలా పెంచుకోవచ్చు
శరీరంలో రక్త ప్రసరణను ఇలా పెంచుకోవచ్చు ఈ మద్యం తాగడం మానేయాలి ఈ నీరు ఎక్కువగా తాగాలి ఈ నట్స్ ఎక్కువగా తీసుకోవాలి ఇ చక్కెర, కెఫిన్ పదార్థాలను తినడం తగ్గించాలి. ఉప్పు వాడకం తగ్గించాలి. డార్క్ చాక్లెట్లను తినాలి * గ్రీన్ టీ తాగాలి * పుచ్చకాయ, దానిమ్మ ఎక్కువగా తీసుకోవాలి
Read More »అధిక ఉప్పు తింటున్నారా..?
అధిక ఉప్పు వల్ల మెదడులో మంట, నొప్పి, దురద వంటివి కలిగి పిచ్చిగా ప్రవర్తిస్తామట. ఎలుకలపై చేసిన ప్రయోగం ద్వారా ఈ విషయం వెల్లడైంది. అందుకే ఉప్పు ఎక్కువగా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. ఇక వేసవిలో సాల్ట్ను దాదాపు పూర్తిగా తగ్గించడం బెటర్. ఉప్పు తక్కువగా తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.
Read More »బొప్పాయితో ప్రయోజనాలు ఎన్నో..?
ఒత్తిడి జీవితం, మారిన జీవనశైలి, హార్మోన్లలో మార్పులు, ఆహార అలవాట్ల వల్ల మహిళల్లో పీరియడ్స్ సమయానికి రావు. అయితే బొప్పాయిలో ఉండే కెరోటిన్.. ఈస్ట్రోజెన్ హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది సహజంగా పీరియడ్స్ వచ్చేలా చేస్తుంది. అలాగే కొత్తిమీరలో ఉండే అపియోల్, మిరిస్టిసిన్ గర్భాశయం సంకోచించేలా చేసి నెలసరికి దోహదపడుతుంది. వీటితోపాటు అల్లం-లవంగం వాము తీసుకుంటే మంచిది.
Read More »నిమ్మరసం తాగడం వల్ల లాభాలెన్నో..?
నిమ్మరసం తాగడం వల్ల జీర్ణక్రియ రేటు పెరుగుతుంది. అలాగే ఇది వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ క్యాలరీలను బర్న్ చేస్తూ.. కొవ్వును నిల్వ ఉండకుండా చేస్తుంది. క్రమం తప్పకుండా లెమన్ జ్యూస్ తాగితే జలుబు, ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. అయితే దీని ప్రయోజనాలు పొందాలంటే నిల్వ చేసిన నిమ్మరసం తాగకూడదు.
Read More »అంతర్జాతీయ క్రికెట్ కి రాస్ టేలర్ గుడ్ బై
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. బంగ్లాదేశ్తో త్వరలో జరగనున్న రెండు టెస్టులు, ఆస్ట్రేలియా, నెదర్లాండ్తో ఆరు వన్డేల అనంతరం క్రికెట్ నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. గత 17 ఏళ్లుగా సపోర్ట్ చేసిన అభిమానులకు థ్యాంక్స్ చెప్పి టేలర్.. తన దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని ట్వీట్ చేశాడు.
Read More »