ఇటీవల కరోనా బారిన పడిన మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని కోల్కతాలోని వుడ్అండ్ ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుతానికి ఆయనకు జ్వరం లేదని తెలిపింది. నిపుణులైన వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని, భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. గంగూలీకి కొన్ని నెలల కిందట యాంజియోప్లాస్టీ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నారు.
Read More »ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో కొవిడ్తో ఎవరూ చనిపోలేదు. 186 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య- 20,76,849 మరణాల సంఖ్య – 14,492 మొత్తం కోలుకున్న వారి సంఖ్య- 20,61,308 ప్రస్తుతం యాక్టివ్ కేసులు- 1,049
Read More »ఇర్ఫాన్ పఠాన్ ఇంటికి వారసుడోచ్చాడు
భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మరోసారి తండ్రయ్యాడు. తనకు మరో కుమారుడు జన్మించినట్లు పఠాన్ వెల్లడించాడు. కీలక ఆల్రౌండర్గా టీమ్ ఇండియాకు ఎన్నో విజయాలు అందించిన ఇర్ఫాన్.. 2016లో హైదరాబాద్ మోడల్ సాఫా బైగ్ ను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇప్పటికే కుమారుడు (ఇమ్రాన్ ఖాన్ పఠాన్) ఉన్నాడు. తమ రెండో కుమారుడికి సులేమాన్ ఖాన్ అని పేరు పెట్టినట్లు పఠాన్ వెల్లడించాడు.
Read More »రిషబ్ పంత్ అరుదైన రికార్డు
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అరుదైన రికార్డు సృష్టించాడు. తక్కువ టెస్టు మ్యాచ్లో 100 మందిని ఔట్ చేసిన భారత కీపర్ గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో పంత్.. ధోని, సాహా రికార్డులను బ్రేక్ చేశాడు. ధోనీ, సాహా 36 టెస్టుల్లో ఈ ఘనత సాధించగా పంత్ కేవలం 26 టెస్టుల్లోనే 100 మందిని ఔట్ చేశాడు. ఇక కేవలం 21 టెస్టుల్లోనే 100 మందిని ఔట్ చేసిన …
Read More »థాయ్ లాండ్ కి మాజీ సీఎం చంద్రబాబు
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కుటుంబసభ్యులతో కలసి థాయ్ లాండ్ విహార యాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ఈ నెల 24వ తేదీనే వెళ్లినప్పటికీ పలు కారణాల వల్ల ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడినట్లు సమాచారం. జనవరి 2వ తేదీన ఆయన తిరిగి హైదరాబాద్ రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Read More »‘పుష్ప’ టీమ్ కు సుకుమార్ బంపర్ ఆఫర్
ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన ‘పుష్ప’ సినిమా కోసం పని చేసిన కిందిస్థాయి సిబ్బందికి డైరెక్టర్ సుకుమార్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. టెక్నీషియన్స్, సెట్ బాయ్స్ పాటు సినిమా కోసం పనిచేసిన సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున గిఫ్ట్ ఇస్తానని ప్రకటించాడు. మూవీ షూటింగ్ సమయంలో వారందరూ అడవుల్లో ఎంతో కష్టపడ్డారని సుకుమార్ చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా మంచి హిట్ సాధించింది.
Read More »కీర్తి సురేష్ భర్తగా నాగ శౌర్య
అన్నాత్తే మూవీలో సూపర్ స్టార్ రజినీకాంత్ చెల్లెలిగా నటించి ప్రశంసలందుకున్న క్యూట్ హీరోయిన్ కీర్తి సురేశ్.. భోళాశంకర్లోనూ మెగాస్టార్ చిరంజీవికి సిస్టర్గా చేయనున్నట్లు తెలిసిందే. అయితే ఈ సినిమాలో కీర్తికి భర్తగా యంగ్ హీరో నాగశౌర్య నటించనున్నాడని టాలీవుడ్ టాక్ నడుస్తోంది. మూవీకి మెహర్ రమేశ్ డైరెక్ట్ చేస్తుండగా.. తమిళంలో వచ్చిన వేదాళం సినిమాను తెలుగులో భోళాశంకర్గా రీమేక్ చేస్తున్నారు.
Read More »టికెట్ ధరల వ్యవహారంపై మంచు విష్ణు మౌనం ఎందుకు..?
ఏపీలో సినిమా టికెట్ ధరల వ్యవహారం రచ్చ లేపుతున్నా.. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించకపోవడం చర్చనీయాంశమవుతోంది. దీనిపై ఇప్పటికే పలువురు హీరోలు, డైరెక్టర్లు ప్రభుత్వ నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యతిరేకించారు. అయితే విష్ణు ఇంతవరకు నోరు విప్పలేదు. కనీసం ట్వీట్ కూడా చేయకపోవడం గమనార్హం. సీఎం జగన్ బంధుత్వం వల్లే విష్ణు సైలెంట్ గా ఉంటున్నారని కొందరు వాదిస్తున్నారు.
Read More »సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై మంత్రి KTR సెటైర్స్
ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే రూ. 75కే చీప్ లిక్కర్, ఇంకా కుదిరితే రూ.50కే ఇస్తామంటూ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘వావ్… ఏమి పథకం! ఎంత అవమానకరం. ఏపీలో బీజేపీ మరింత దిగజారింది’ అంటూ ఎద్దేవా చేశారు. చీప్ లిక్కర్ను రూ.50కే సరఫరా చేయాలనేది బీజేపీ జాతీయ విధానమా? లేక నిరాశ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు మాత్రమేనా ఈ బంపర్ …
Read More »UKలో కరోనా కలవరం
UKలో గత 24 గంటల్లో 1,29,471 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఇదే రికార్డు. తాజా కేసులతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,23,38,676కి చేరుకుంది. ఒక్కరోజే 18 మంది ఈ వైరస్ కారణంగా మరణించారు. వీటితో మొత్తం మరణాల సంఖ్య 1,48,021కి చేరుకుంది. కరోనా వ్యాప్తికి ఒమిక్రాన్ వేరియంట్ ప్రధాన కారణమని తెలుస్తోంది.
Read More »