కేంద్రం ధాన్యం కొనుగోలు చేయని పక్షంలో రాష్ట్రంలోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వలపుబాణాలు విసురుకొంటున్నాయని విమర్శించారు. విత్తనాలకోసం, ఇంటి అవసరాల కోసం మిల్లర్లతో ఒప్పందాలు ఉంటే వారి వేసుకోవచ్చని గతంలోనే ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు. పీసీసీ చీఫ్ రేవంత్కు భూమి ఉంటే ఆయన కూడా వరి వేసుకోవచ్చని మంత్రి సూచించారు.
Read More »యాషెస్ టెస్టు సిరీస్ ఆసీస్ కైవసం
ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్ లో ఆస్ట్రేలియా మరో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే 3-0 తేడాతో కైవసం చేసుకుంది. తాజాగా మూడో టెస్టులో ఇన్నింగ్స్ 14 పరుగుల తేడాతో ఘనవిజయం సొంతం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ ENG 185 రన్స్ చేయగా AUS 267 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో ENG 68 రన్స్కో కుప్పకూలింది. తొలి మ్యాచ్ ఆడుతున్న ఆసీస్ బౌలర్ బోలాండ్ 6 వికెట్లు పడగొట్టి …
Read More »యాషెస్ సిరీస్ లో ఇంగ్లండ్ చెత్త రికార్డు
యాషెస్ సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ టీం టెస్టుల్లో చెత్త రికార్డును నమోదు చేసింది. ఒక క్యాలెండర్ ఇయర్లో టెస్టుల్లో ఎక్కువ ఓటములు చవిచూసిన జట్టుగా బంగ్లాదేశ్ సరసన చేరింది. 2003లో బంగ్లాదేశ్ ఆడిన 9 మ్యాచ్ 9 ఓడిపోగా 2021లో ENG 15 మ్యాచ్ 9 ఓడిపోయింది. ఆస్ట్రేలియాలో ఆడిన చివరి 13 టెస్టుల్లో ఇంగ్లండ్ ఒక్కసారి కూడా గెలవలేదు. ఇక 2021లో టెస్టుల్లో ENG ప్లేయర్లు 54 సార్లు …
Read More »అమెరికాలో కరోనా కల్లోలం
అమెరికాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల కోసం జనం పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేస్తుండటంతో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. అమెరికాలో రోజువారీ కరోనా కొత్త కేసులు ఇప్పుడు 2లక్షల మార్కుకు చేరువయ్యాయి. అతి త్వరలోనే ఆ సంఖ్య తొలిసారి 5లక్షల మార్కును తాకే అవకాశం ఉంది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వెల్లడించిన డేటా ప్రకారం ప్రతిరోజూ సగటున 1,98,404 కొత్త కేసులు నమోదవుతున్నాయి.
Read More »ఇంగ్లండ్ క్యాంప్ లో కరోనా కలవరం
ఇంగ్లండ్ క్యాంప్ లో మొత్తం 6 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని తెలుస్తోంది. అయితే.. జట్టు సపోర్టింగ్ స్టాఫ్, ఆటగాళ్ల కుటుంబ సభ్యులకు మాత్రమే పాజిటివ్ వచ్చిందట. ప్రస్తుతానికి ఆటగాళ్లకెవరికీ వైరస్ సోకలేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్లో ఓటమి ముంగిట ఇంగ్లండ్ జట్టు కొట్టుమిట్టాడుతోంది. మరి ఈ సిరీస్ కొనసాగుతుందా..? లేక రద్దవుతుందా..? వేచి చూడాలి.
Read More »తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య తాజాగా 12
తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మరో 12 కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 55కి చేరింది. తాజా కేసుల్లో రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ (మ) గూడెం గ్రామానికి ఇటీవల వచ్చిన ఓ యువకుడికి ఒమిక్రాన్ వచ్చింది .. తాజాగా అతడి తల్లి, భార్యకు కూడా ఒమిక్రాన్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే ఎల్లారెడ్డిపేట(మ) నారాయణపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ …
Read More »బీట్ రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
బీట్ రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు > పీచు పదార్థం సమృద్ధిగా ఉండి జీర్ణవ్యవస్థను > మెరుగుపరుస్తుంది ఫైబర్ అధికంగా ఉండి అదనపు కొవ్వును తగ్గిస్తుంది. > విటమిన్ Cతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. > తక్కువ కేలరీలు ఉండటంతో బరువు తగ్గాలి > అనుకునేవారికి సహకరిస్తుంది. > విటమిన్ Bతో జీవక్రియ, నాడీవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.
Read More »త్వరలోనే బీజేపీలో కాంగ్రెస్ విలీనం-మంత్రి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణకు సంబంధించి త్వరలోనే బీజేపీలో కాంగ్రెస్ విలీనం కావడం ఖాయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పని చేస్తున్నాయి. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఓట్లు బీజేపీ అభ్యర్థికి వేయించలేదా? అని ప్రశ్నించారు. ధాన్యం విషయంలో బీజేపీని కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిలదీస్తలేదని మంత్రి అడిగారు. తెలంగాణ రాష్ట్రం …
Read More »చలికాలంలో దగ్గు, జలుబు ఇబ్బంది పెడుతుందా..?
చలికాలంలో చాలా మందికి దగ్గు, జలుబు, తుమ్ములు, కఫం వంటి సమస్యలు వస్తాయి. ఈ కింది జాగ్రత్తలు పాటిస్తే ఉపశమనం పొందవచ్చు. 1. తేనెలో అల్లం కలుపుకుని తాగాలి. 2. పావు స్పూన్ మిరియాల పొడిని తేనెలో కలిపి తరచూ తీసుకోవాలి. 3. వేడినీటిలో పసుపు వేసుకుని ఆవిరిపట్టాలి. 4. వేడినీటిలో అల్లం ముక్కలు ఉడకబెట్టి, కొద్దిగా చక్కెర వేసుకుని తాగాలి. 5. మిరియాలు, ధనియాలు కషాయంగా చేసుకుని తాగాలి.
Read More »పొద్దున లేవగానే టీ తాగుతున్నరా..?
పొద్దున లేవగానే దాదాపు అందరూ టీ తాగుతుంటారు. అయితే టీ.. మీ బరువు పెరుగుదలకు కారణమని తెలుసా? సాధారణంగా కప్పు టీలో 126 కేలరీలు ఉంటాయి. టీలో కలిపే పాలు, చక్కెర వల్ల కేలరీలు పెరుగుతాయి. ఇక రోజులో 1-5 సార్లు చాయ్ తాగే వారి శరీరంలో సుమారు 600 కేలరీలు చేరతాయి. దీంతో బరువు పెరిగి ఊబకాయం బారిన పడతారు. అయితే టీలో పాలు తగ్గించుకుని, బెల్లం వేసుకోవడం …
Read More »